ఆంధ్రప్రదేశ్‌

కాగ్ మిమ్మల్నీ తప్పుపట్టింది సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: పోలవరం, పట్టిసీమపై కాగ్ (సీఏజీ) తప్పుబట్టిందంటుని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు కేంద్రాన్ని కూడా కాగ్ తప్పుబట్టిన నేపథ్యంలో సీబీఐ విచారణకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు జల సంరక్షణ తదితర అంశాలపై సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ ఏడాదితో ప్రపంచ జల దినోత్సవం రజతోత్సవాలు జరుపుకుంటుందని తెలిపారు. ఈ శతాబ్దంలో ఎదుర్కొనే నీటి కష్టాలకు ప్రకృతిసిద్ధ పరిష్కారాలను అనే్వషించటమే ఈ ఏడాది జలవనరుల దినోత్సవ ప్రాధాన్యతగా చెప్పారు. ఇందులో భాగంగా భూమిలో తేమను కాపాడటం..్భగర్భజలాలను వృద్ధి చేయటం.. నీటి నాణ్యతను మెరుగుపరచి విపత్తులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించటానికి సహజ ప్రక్రియలుగా దోహదపడతాయని వివరించారు. నీటి సవాళ్లకు ప్రకృతిసిద్ధ పరిష్కారాలను చేపట్టటంలో రాష్ట్రం ఇప్పటికే ముందంజలో ఉందన్నారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణలో మార్పులు, పారిశ్రామికీకరణ వల్ల అవసరాలు పెరుగుతున్నాయని, దీనిని గుర్తిస్తూ రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం.. త్రాగునీరు..సాగునీరు పారిశ్రామిక అవసరాల కోసం నీటి భద్రతను కల్పించటం ప్రభుత్వ దార్శనికతగా ఉంది.. ప్రాథమికరంగం మిషన్ కింద..నీటి పరిరక్షణ మిషన్‌ను ఒక ఉప మిషన్‌గా చేపట్టటమైందని తెలిపారు. రాష్ట్ర వృద్ధి చోదకాన్ని శక్తివంతం చేసేందుకు ఏర్పాటుచేసిన 7 మిషన్లలో ఇది ఒకటన్నారు. ఈ మిషన్ కింద నీటిని పరిరక్షించి, పర్యావరణాన్ని కాపాడేందుకు నీరు-చెట్టును ప్రధాన కార్యక్రమంగా చేపట్టామన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా ఈ ఏడాది జూన్ 7వ తేదీ వరకు జలసంరక్షణను ఉద్యమంగా చేపట్టాలన్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీకి నీరందించడం ద్వారా 144.09 లక్షల ఎకరాలకు సాగునీరందించామని వివరించారు. పట్టిసీమ ద్వారా 105.9 టీఎంసీలు రికార్డు పరిమాణంలో నీటిని విడుదల చేశామన్నారు. దీనివల్ల పోతురెడ్డిపాడు నుంచి 90.25 టీఎంసీల నీటిని సీమకు అందించే వీలు కలిగిందన్నారు. గోరకల్లు రిజర్వాయర్‌లో 7.74 టీఎంసీలు, వెలుగోడుకు 16.95, అవుకు 2.47, గండికోటలో 19.5 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు 81.55, ఎడమ కాల్వ ద్వారా 10.06 టీఎంసీల నీటిని సరఫరా చేశారని తెలిపారు. భూగర్భజలాల మట్టాన్ని 3 ముండి 8 కిలోమీటర్ల నిర్వహణ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.ఇందులో భాగంగా గణనీయంగా పెరుగుదల సాధించామన్నారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల నిర్వహణ వ్యవస్థ విస్తరించి ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌సితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా లక్ష్యాలను అధిగమించగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 52 నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలోగా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయటంతో పాటు పోలవరం నిర్మాణమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. పోలవరాన్ని నిలువరించే ప్రయత్నం చేయవద్దని వైసీపీ, బీజేపీకి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరని మరోసారి ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే పోలవరానికి అంచనాలు రూపొందిస్తే అందులో ఏదో అవినీతి జరిగిందని కాగ్ తప్పుపట్టిందని చెప్పడం అవాస్తవమన్నారు. పట్టిసీమ, పోలవరం అంశాలను పరిశీలన జరపాలని మాత్రమే కాగ్ స్పష్టం చేసిందన్నారు. ఒప్పందం ప్రకారం సకాలంలో డబ్బులిస్తే పోలవరం పూర్తి కాగలదన్నారు. తెలుగుప్రజల జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపటం మీ
తాతల తరం కూడా కాదన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్‌కళ్యాణ్ అనాలోచితంగా మాట్లాడితే అనర్థాలు తప్పవన్నారు. రాజకీయాలు వేరు..అభివృద్ధివేరు.. ఏదైనా అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు. ఆ ముగ్గురూ (ప్రధాని మోడీ, జగన్, పవన్) ఏకమై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి- కృష్ణా- పెన్నా అనుసంధానంతో కరవును జయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు తిరగబడతారని స్పష్టం చేశారు. తొలుత హోదా అన్నారు..తరువాత ప్యాకేజీ అన్నారు.. ఇప్పుడు ఎస్‌పీవీ అంటున్నారు.. అవినీతి పరులకు ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రవేశం వల్ల ఎలాంటి సంకేతాలు అందిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.