ఆంధ్రప్రదేశ్‌

ఐదు టవర్లుగా సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: ఇక సచివాలయ శాశ్వత నిర్మాణాల ఆకృతుల కోసం ఆలస్యం చేయవద్దని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డివిజన్లపై అభిప్రాయ సేకరణకు శుక్రవారం ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు ఐకానిక్ నిర్మాణాలు వస్తే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. కేవలం భవన నిర్మాణ శైలి, దాని ఆకృతి వల్ల ఐకానిక్ అవదు. బాహ్య పరిసరాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. కార్యాలయ వేళలు దాటాక పరిపాలనా భవనాల ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా మారిపోకూడదు. అక్కడ యాక్టివిటీ జరగాలి. ప్రజలు సందర్శించి నిర్మాణాలు చూసేందుకు, అక్కడ షాపింగ్ చేసేందుకు అనువైన వాతావరణం ఉండాలి. సచివాలయ ప్రదేశంలో ఉద్యోగులు, అధికారులు, రోజువారి సందర్శకుల కోసం ఏర్పాటుచేసే ఫుడ్ ప్లాజాలు, షాపింగ్ మాల్స్‌లో సాధారణ ప్రజానీకానికి కూడా ప్రవేశం ఉండాలి. ఇక నిర్మాణాల ఆకృతుల కోసం ఆలస్యం చేయడానికి వీల్లేదు. సత్వరం పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశించారు. గురువారం నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో సచివాలయం తుది ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాలవాగుకు రెండు వైపులా సచివాలయ భవంతులు. ఐదు టవర్లుగా సచివాలయం. అన్ని టవర్లను కలుపుతూ 600 మీటర్ల మేర అంతర్గత మార్గం ఉంటుందని, ఏ బ్లాకు నుంచి ఏ బ్లాకుకు చేరుకోవడానికి వారధిగా ఈ మార్గం డిజైన్ చేశామని సీఎంకు వివరించారు. సీఎం ఆఫీసు, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఒకే టవర్‌లో ఉండేలా డిజైన్ రూపొందించామని, సీఎం టవర్‌కు చెంతనే సీఎస్ టవర్ ఉంటుందని, ఒక్కొక్క టవర్ 40 అంతస్తులు ఉంటుందన్నారు. 46 అంతస్థులుగా సీఎం టవర్, పైభాగాన హెలీప్యాడ్ ఉంటుందని వివరించారు. పాలవాగుకు అటువైపు మూడు టవర్లు ఉంటాయని, ఇందులో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయన్నారు. 5 టవర్లకు చెంతనే ఫుడ్ ప్లాజాలు, స్పోర్ట్స్ ఏరియా, ఇతర అమెనిటీస్ కోసం విడిగా నిర్మాణాలుంటాయని రెండంతస్తులుగా వీటి నిర్మాణం ఉంటుందని, సాధారణ ప్రజలకు సచివాలయ ప్రాంగణ ప్రవేశం ఉండేలా ఆకృతుల రూపకల్పన చేశామన్నారు. సాయంత్రం వేళల్లో, సెలవు దినాల్లో సాధారణ ప్రజలు, పర్యాటకులు వచ్చి సేదదీరేందుకు వీలుగా సచివాలయం ఉండాలని సూచించారు. అప్పుడే ఆ ప్రాంతం డైనమిక్‌గా, పర్యాటక ఆకర్షక ప్రదేశంగా ఉంటుందని, అలాగాక ప్రజలకు ప్రవేశం ఇవ్వకపోతే అవి సాధారణ ప్రభుత్వ కార్యాలయాలుగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. పరిపాలన నగరంలో ప్రతి నిర్మాణం దేనికవే ఐకానిక్ కట్టడాలుగా ఉండాలని, ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నప్పుడే అది సందర్శన స్థలంగా, పర్యాటక ప్రాంతంగా రూపుదాల్చగలదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.