ఆంధ్రప్రదేశ్‌

సృజనకు ‘సంతోష’ సదస్సు వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అమరావతిలో ఏప్రిల్ 10, 11, 12 నుంచి జరిగే సంతోష నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమ్మిట్ ఏర్పాట్ల)పై సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. ఒకటో తేదీ నాటికి విజయవాడ నగరం ఈ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, సదస్సు సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని మన బెజవాడ సంతోష నగరంగా మారిపోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడను సంతోష నగరంగా మార్చేందుకు ప్రజలు, అధికారులు, ఉద్యోగులు సమాయత్తం కావాలని, అందరూ కలిసి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సేవకులు సంతోష నగరాల సదస్సుకు సహకరించేందుకు సిద్ధమయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.