ఆంధ్రప్రదేశ్‌

సంక్లిష్టంగా నీటి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: నీటి సమస్య ప్రపంచానికి సవాలు విసురుతోందని సీఎస్‌ఐఆర్ నేషనల్ ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంచాలకులు ప్రొఫెసర్ వీఎం తివారీ అభిప్రాయపడ్డారు. ఏయూ ఫిజిక్స్, జియాలజీ విభాగాలతో పాటు అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ నీటి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి లభ్యత, వినియోగం అంశాలు భవిష్యత్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. యువతను చైతన్యం చేస్తూ, అవగాహన కల్పించి నీటి వనరులను కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. నీటి సవాళ్లకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలున్నాయని, వీటిని పాటించాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీ వినోదరావు మాట్లాడుతూ నీటి వనరులను కాపాడుకుంటూ భూగర్భ జలాలను పెంపొందించుకోవాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటే భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయన్నారు. నీటిపై ప్రజలకు అవగాహన లేకపోతే భవిష్యత్‌లో నీటి హాలిడే పాటించాల్సిన దుర్భర పరిస్థితులు తప్పవన్నారు. అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వీవీ జగన్నాధ శర్మ రచించిన పుస్తకాన్ని తివారీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రామారావు, జియాలజీ విభాగాధిపతి వీవీ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెఆర్ శర్మకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బ్రహ్మప్రకాష్ జీవన సాఫల్య పురస్కారాన్ని, సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ ఆచార్య షకీల్ అహ్మద్‌కు హైడ్రాలజీ లెక్చర్ అవార్డును ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ కే గాయత్రి దేవి చేతుల మీదుగా అందజేశారు.