ఆంధ్రప్రదేశ్‌

కేసీఆర్ శిఖండి, సైంధవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 23: రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు ఈనెల 27వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పి మధు పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్‌సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శిఖండిలా, సైంధవుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘాల జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడమే కాకుండా పార్లమెంటులో ఆవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా అంశం పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు రాకపోవడం దారుణమని, ఉపరాష్టప్రతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వగలిగిన స్థానంలో ఉండి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికైనా సాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్, అన్నాడిఎంకె పార్టీల ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చేలా పార్లమెంటులో అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఐదు కోట్ల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో ఆరు రోజులుగా చర్చ జరుగకుండా వారికి కావలిసిన బిల్లులను పాస్ చేసుకుంటున్నారని, ఆవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఏప్రిల్ 6వతేదీ వరకు జరగవలసి ఉందని, మధ్యలోనే నిలిపివేస్తే ఆరోజును చికటి దినంగా భావించి రాష్ట్రంలో గంట పాటు లైట్లు ఆపేసి, నిరసన తెలియజేస్తామన్నారు.