ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ 7 స్టేట్స్‌పై అమిత్‌షా అప్పుడే చెప్పారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: 2016లో అస్సాం ఎన్నికల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆపరేషన్ 7 స్టేట్స్ అని చెప్పారు.. ఈ ఆపరేషన్‌లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలున్నాయి.. ప్రత్యేక హోదా అడుగుతున్నందుకే వాళ్లు వెంకయ్యనాయుడికి ఉప రాష్టప్రతి ఇచ్చి పక్కన పెట్టారు. వాళ్లు నాలుగేళ్లు తమ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని అనుకున్నాం.. కానీ కుట్రలకు పాల్పడి మిత్రపక్షాలనే మింగేస్తున్నారని అనుకోలేద’ని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో మిత్రపక్షంగా టీడీపీ హుందాగా వ్యవహరించిందని, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్, ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారని, అందువల్ల మాకు మిత్ర ధర్మం పాటించడం తెలుసని, గీత దాటకుండా నడుచుకున్నామని చెప్పారు. నాలుగేళ్లు బీజేపీ చేసిన అవమానాలు భరిస్తూ ఢిల్లీ చుట్టూ తిరగామని, అయితే ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణాలో టీడీపీతో పొత్తును బీజేపీ ఏకపక్షంగా తెగదెంపులు చేసుకుందన్నారు. తాము నిర్మలా సీతారామన్‌కు, సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించినా రాష్ట్రంపై బీజేపీ కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీడీపీ, బీజేపీ రాజకీయ మిత్రపక్షాలు. ఈ రెండింటికీ వైఎస్సార్ సీపీ రాజకీయ ప్రత్యర్థి. టీడీపీని కాదని జగన్‌కు బీజేపీ ప్రాధాన్యమిస్తోంది. ఇదేనా మీరు పాటించే మిత్రధర్మం.. అతి పెద్ద ఆర్థిక నేరాల్లో ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తారు. సీఎం చంద్రబాబుకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ఏడాదిన్నర తరువాత సీఎం చంద్రబాబుకు మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయాలని సీఎం కోరినా ప్రధాని పట్టించుకోలేదు. మేం బీజేపీని భుజాన ఎత్తుకున్నాం. రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టేశారంటూ మమ్మల్ని జగన్ బద్నామ్ చేయాలని చూశారు. ఏ నాడూ ఈ వ్యాఖ్యలను కేంద్రం గానీ, బీజేపీ నేతలు గానీ ఖండించలేదు. జగన్‌ను ఒక్క మాట అనలేదు. అదే సమయంలో విజయసాయిరెడ్డిని పక్కనబెట్టుకున్నారు. ఇదేనా మిత్రధర్మం? మీ మాటలు నమ్మిన తమిళనాడు నేత పన్నీరు సెల్వం పరిస్థితి ఎలాగుందో తెలుసుకోండి’ అని హెచ్చరించారు. మోదీ, అమిత్‌షా వచ్చిన తరువాత మిత్రధర్మాలు మారిపోయాయని, సంప్రదాయాలు, పద్ధతులకు బీజేపీ నేతలు చెల్లు చీటీ ఇచ్చారని విరుచుకుపడ్డారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీని నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం అడుగుతున్నందుకే వెంకయ్యనాయుడికి ఉప రాష్టప్రతి పదవిచ్చి పక్కన బెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు.