ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేల క్వార్టర్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: రాజధాని అమరావతిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేల క్వార్టర్లు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ ఆకృతులను ఆయన ఎమ్మెల్యేలకు చూపించారు. వాటి ప్రత్యేకతలను వివరించారు. వాటిపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. మీకు క్వార్టర్లు లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. అందుకే మీకు డిసెంబర్ నాటికి ఆ కష్టాలు లేకుండా చూస్తానని నవ్వుతూ చెప్పారు. ‘ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే క్వార్టర్లు సిద్ధమవుతాయి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలా సకల సౌకర్యాలతో ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా హాల్‌ని ప్రతి క్వార్టర్‌లోనూ ఏర్పాటు చేస్తున్నాం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లండి, ఇసుజు, కియా, సీరో వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి, ఇంకా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, నూతన శాసనసభ భవంతిలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో కష్టపడి పనిచేసి, వచ్చే ఎన్నికల్లో ప్రజామోదం పొందాలన్నారు.