Others

పోలవరం ముంపు గ్రామాల పునరావాసంపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 2: బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు పునరావాసం అందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకు పోలవరం హెడ్ వర్క్సు ప్రాంతంలో కేవలం 14 గ్రామాలపైనే కాకుండా మిగిలిన మొత్తం ముంపు ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి పునరావాసం ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి సీడబ్ల్యుసీకి నివేదిక పంపించడానికి చర్యలు చేపట్టినట్టు తెలియవచ్చింది. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటివరకు ఖర్చు చేసింది, అందించాల్సిన ప్యాకేజీ తదితర వివరాలు సీడబ్ల్యుసీకి పంపిస్తున్నట్టు తెలియవచ్చింది. ప్రధానంగా ప్రాజెక్టు ముంపు ప్యాకేజీ 41.15 మీటర్లు కాంటూరులోనూ, 45.72 మీటర్ల కాంటూరుకు సంబంధించి ముంపు, పునరావాసానికి సంబంధించిన ఖర్చు తదితర అంశాలపై తాజాగా సీడబ్ల్యూసీకి నివేదిస్తున్నట్టు సమాచారం.
ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 29316.28 ఎకరాలు ముంపునకు గురవుతుందని, 12,449 మంది నిర్వాసితులవుతున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి భూమికి పరిహారంగా రూ.1434 కోట్లు, నిర్వాసితులకు రూ.1921 కోట్లు చెల్లించాల్సివుంది. ఇందులో ఇప్పటివరకు 28,972.28 ఎకరాల భూమిని సేకరించడం పూర్తిచేశారు. ఇందుకు రూ.1348 కోట్లు ఖర్చుచేశారు. అదేవిధంగా నిర్వాసితులకు సంబంధించి 2584 మందికి రూ.160 కోట్లతో పునరావాసం కల్పించారు. ఇంకా 344 ఎకరాల భూమికి రూ.86 కోట్లు, 9865 మంది నిర్వాసితులకు రూ.1761 కోట్లు ఖర్చు చేయాల్సివుంది.
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ముంపు భూసేకరణకు 16,111.65 ఎకరాలు అవసరం కాగా అందులో ఇప్పటివరకు రూ.480.99 కోట్లు ఖర్చు చేసి 15,239.20 ఎకరాలు సేకరించారు. నిర్వాసితులకు పునరావాసంగా 5290 మందికి గాను ఇప్పటి వరకు రూ.892 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా 872.45 ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందుకు రూ.199.01 కోట్లు ఖర్చు చేయాల్సివుంది. అదేవిధంగా 4526 మంది నిర్వాసితులకు 838.65 కోట్లు ఖర్చు చేయాల్సివుంది. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో రూ. 4727.99 కోట్లు ఖర్చు అవసరం కాగా ఇప్పటి వరకు రూ.1842.33 కోట్లు ఖర్చయింది. ఇంకా రూ. 2884.66 కోట్లు ఖర్చు చేయాల్సివుంది. అదే విధంగా 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించే క్రమంలో ముంపునకు గురయ్యే ప్రాంతం, నిర్వాసితులకు గృహ నిర్మాణం, భూమికి భూమి తదితర పునరావాస ప్యాకేజీకి సంబంధించి మొత్తం 1,62,739 ఎకరాలు అవసరంగా గుర్తించారు. ఇందుకు రూ.33,225.74 కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 1,02,480.90 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇందులో ఇప్పటి వరకు రూ.4922.76 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా 60,258.10 ఎకరాలు సేకరించాల్సి వుండగా రూ.28,302.98 కోట్లు అవసరం వుందని నివేదించారు. మొత్తం మీద పోలవరం పునరావాస ప్యాకేజీపై పనుల దామాషా ప్రకారం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భూమికి, భూమి, నిర్వాసితులకు పునరావాసాన్ని అందించడానికి వారం వారం సమీక్షలతో కార్యాచరణ అమలుచేస్తున్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు నిర్మాణ ప్రాంతం