ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత విద్యామండలి వివాదంలో ఏపీకి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకం విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. విభజనకు ముందు ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులన్నీ విభజన నేపథ్యంలో తెలంగాణకు చెందుతాయన్న హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపి తీర్పునిచ్చింది. విభఝన చట్టంలోని 75 సెక్షన్ ప్రకారం సేవలనే విభజించుకోవాలని, ఆస్తులను ఇరు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన 52-48 నిష్పత్తిలో పంచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. రెండునెలల్లో ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. విభజన అనంతరం 13 జిల్లాల్లో ఏపీ తెరిచిన ఉన్నతవిద్యామండలి ఖాతాలను నిర్వహించుకోవచ్చని సూచించింది. సుప్రీం ఆదేశంతో ఏపీకి ఊరట లభించినట్లయింది. విభజన చట్టంలోని పదవ షెడ్యూల్‌లో సంస్థలన్నింటికి ఈ తీర్పు వర్తిస్తుందని ఏపీ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.