ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ పరీక్షల్లో బాలికల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపిలో తొలిసారిగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఒకేరోజు విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడ ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేసి అత్యధిక మార్కులు సాధించిన వారిని అభినందించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే ఉత్తీర్ణతా శాతంలో టాప్‌గా నిలిచారు. రాష్ట్రం మొత్మమీద ఫస్ట్ ఇయర్‌లో 68.05, సెకండ్ ఇయర్‌లో 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందంజలో ఉండగా అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా ఆధిక్యతలో ఉండగా కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈనెల 26లోగా ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది.