ఆంధ్రప్రదేశ్‌

సైకిలెక్కిన మరో వైకాపా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నుండి అధికారపక్ష తెలుగుదేశం పార్టీలోకి శాసనసభ్యుల వలస అప్రతిహతంగా సాగుతోంది. సిఎం చంద్రబాబు నివాస గృహంలో కర్నూలు జిల్లా కోడుమూరు వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ బుధవారం చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. ఆయనవెంట కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తదితర నేతలు పార్టీలో చేరారు. ఈ వలసలపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు చెలరేగుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం వెనుదిరగకుండా వచ్చినవారిని వచ్చినట్లే పార్టీలో చేర్చుకుంటున్నారు. వీరి రాకను వ్యతిరేకిస్తున్న ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మరో 50 శాసనసభ స్థానాలు పెరగగలవని, మీ సీట్లకు ఢోకా లేదంటూ భరోసా ఇస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవులను ఇవ్వగలనంటూ ఆశ చూపుతున్నారు. వలసల పట్ల తొలుత తాను ఆసక్తి చూపనప్పటికీ ప్రతిపక్ష నేత జగన్ తనను రెచ్చగొట్టేలా 20మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, క్షణాల్లో ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ రెచ్చగొట్టడం వలనే తలుపులు తెరచినట్లుగా చంద్రబాబు తమ నేతలతో నిర్మొహమాటంగా చెబుతున్నారు.