ఆంధ్రప్రదేశ్‌

ఉచితంగా ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని 157 ఇసుక రీచ్‌లనుంచి తక్షణమే ప్రజలందరికీ ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని శ్రీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కులపతిగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను నియమించాలని కూడా సమావేశం నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50 శాతం సీట్లు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 40 శాతం సీట్లు, విదేశీ విద్యార్థులకు 10 శాతం సీట్లు కేటాయిచాలని నిర్ణయంచింది. తిరుపతిలో ఐసి-2 ఇంక్యుబేషన్ సెంటర్‌ను స్థాపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సెంటరులో మొదటి సంవత్సరంలో 2,500 ఉద్యోగాలు, రాబోయే పదేళ్లలో రూ.6,000 కోట్ల పెట్టుబడులతో పాటు 6,500 ఉద్యోగాలు రానున్నాయి. ఎర్రచందనం, వాణిజ్యపరమైన కలప స్మగ్లింగ్‌ను అరికట్టడం కోసం ప్రస్తుత చట్టానికి పదునుపెట్టి శిక్షలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. మొదటిసారి తప్పు చేసినందుకు రూ.3 లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు, రెండోసారి తప్పు చేసినందుకు రూ.5 లక్షల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు, మూడవసారి తప్పు చేస్తే రూ.10 లక్షల జరిమానాతో పాటు పదేళ్ల జైలుశిక్ష అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి ఆరంభం కావాల్సిన శాసనసభ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపైన అలాగే వైకాపా నుంచి ఎమ్మెల్యేల వలసలపైన చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, వైకాపా చేస్తున్న ఆరోపణలపైనా కేబినెట్ సీరియస్‌గా చర్చించినట్టు తెలుస్తోంది. వైకాపా ఆరోపణలపై సిఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించినట్టు తెలుస్తోంది. వైకాపా తీరును న్యాయపరంగా ఎదుర్కొనే అంశంపైనా చర్చించారని అంటున్నారు. మరోపక్క కాపుల రిజర్వేషన్ల అంశాన్నీ కేబినెట్ చర్చించింది. గడువు ముగియక ముందే మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతోన్న ముద్రగడ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌గానే స్పందించారని అంటున్నారు.
ముద్రగడ లేఖపైనా చర్చించిన కేబినెట్, ప్రజలకు పరిస్థితిని వివరించడం ద్వారానే సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయంచినట్టు సమాచారం. అదే సమయంలో ప్రభుత్వ పరంగా కాపులకు న్యాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో వివరించాలని కూడా నిర్ణయంచారు. అటు ప్రభుత్వంపైనా, ఇటు పార్టీపైనా దుమ్మెత్తిపోస్తున్న రాజకీయ పక్షాల వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారంటూ చంద్రబాబు సీరియస్ అయనట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయ. ఇదిలావుంటే, సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ ఇసుకను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన వారికి, అలాగే అవసరానికి మించి ఇసుకను నిల్వచేసిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీని పర్యవేక్షిస్తారు. ఇసుకపై ఫిర్యాదులు వస్తే స్వీకరించడానికి గాను ఒక టోల్‌ఫ్రీ నంబరుతో పాటు కంట్రోలు రూమ్‌ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు