ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డీలర్ల కమీషన్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్ల కమీషన్‌ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు 20 రూపాయలు కమీషన్ చెల్లిస్తున్నారు. దీన్ని 70 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాపై 77 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం ఐదు వేల రూపాయలు కమీషన్ అందుకుంటున్న రేషన్ డీలర్లు ఇకపై ఎనిమిది వేల రూపాయల వరకూ అందుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేబినెట్ సమావేశం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. వివరాలను చంద్రబాబు విలేఖరులకు తెలియచేశారు. రేషన్ కార్డుదారుడు ఇకపై ఎక్కడ ఉంటే అక్కడే రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తికి రేషన్ ఇస్తారని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినికల్ స్పెషలిస్ట్‌లను నియమించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. స్పెషలిస్ట్‌లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆసుపత్రుల్లో సేవలందించాలనుకున్నా, పాక్షికంగా పనిచేయాలనుకున్న ప్రభుత్వం వారికి సదుపాయాలు కల్పిస్తుందని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే రోగే నేరుగా స్పెషలిస్ట్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స పొందే అవకాశం కూడా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
కృష్ణా జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం)ను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదించిందని చంద్రబాబు చెప్పారు. ఇందుకు 23 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, కేంద్రం 13 కోట్ల రూపాయలు భరిస్తుందని ఆయన చెప్పారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి ఐఐపిఎం తోడ్పాటునందిస్తుందని అన్నారు.
విజయవాడలోని దుర్గా ఘాట్‌ను అభివృద్ధి చేయడానికి 42 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద 6.48 కోట్లతో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల 12 రోజులు 12 అంశాలపై చర్చా గోష్ఠి నిర్వహిస్తున్నామని అన్నారు.