ఆంధ్రప్రదేశ్‌

మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజధాని అమరావతిని అందరి నగరంగా తీర్చిదిద్ది జూన్ 15నుంచి పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం రూ.28 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రాజధాని అమరావతి నుంచే పాలన సాగించేందుకు సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం చేశామన్నారు. జూన్ 8నాటికి రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు తన అనుభవం, సామర్థ్యాన్ని గుర్తించి ఓట్లు వేసి గెలిపించినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వేరే రాష్ట్రాల్లో మనకన్నా ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో వెనుకంజలో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి విభజన హామీలు ఇంకా రావాల్సి ఉందన్నారు. వాటిని సాధించే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే పాలనను ఇక్కడినుంచే శాశ్వతంగా కొనసాగిస్తామని చెప్పారు. రాయలసీమ, బెంగళూరు ప్రధాన రహదారుల నిర్మాణం నరసరావుపేట మీదుగా నిర్మితమవుతుందన్నారు. అమరావతి నుంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం నరసరావుపేట మీదుగా వెళ్తున్నందువలన శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే ద్వారా కేవలం నాలుగైదు గంటల వ్యవధిలోనే రాయలసీమ, బెంగళూరు చేరుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయని, తిరుపతి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, కోటప్పకొండ లాంటి పుణ్యక్షేత్రాలు రాష్ట్రంలో ఉండటం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ పుణ్యక్షేత్రాలను వారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనిషిని మనిషిగా జీవింపజేసేవే ప్రార్థనాలయాలని, ఇక్కడ మానసిక వికాసం, ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన చేకూరుతాయన్నారు. పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని, అందువల్లే కోటప్పకొండను కూడా పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అందరి భాగస్వామ్యం అవసరముందని, అందువల్ల ప్రజలు ముందుకొచ్చి తమవంతు సహకారాన్ని అందించాలని సిఎం చంద్రబాబు కోరారు.
chitram........
సిఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వేంకటరమణ