రాష్ట్రీయం

కాఫీ సాగులో ఏపి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: కాఫీ తోటల పెంపకం, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకనుంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేస్తున్న పది ప్రాంతాల్లో అరకు ఐటిడిఎ ప్రాంతం చోటు చేసుకుంది. ఈ ఏడాది కాఫీ, రబ్బరు పంటలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించి అందుకు అవసరమైన నిధులను, వౌలిక సదుపాయాలను, కమిటీలను నియమించింది. కాఫీ తోటల అభివృద్ధికి ప్రభుత్వం గురువారం నాడు అపెక్స్ కమిటీని నియమించింది. ఐటిడిఎ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకానికి 526 కోట్ల రూపాయిలను వెచ్చించనుంది. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయిల వరకూ ఆర్థిక సాయం అందించనుంది. 1960 నుండి అరకులో కాఫీ తోటల పెంపకం సాగుతోంది. ఎపిఎఫ్‌డిసి ఇంతకాలం కాఫీ తోటల పెంపకాన్ని పర్యవేక్షించేది. 1960 నుండి 1978 వరకూ 1296 హెక్టార్లలో కాఫీ తోటల పెంపకం చేపట్టారు. 1978 తర్వాత 1984 వరకూ 2714 హెక్టార్లలో కాఫీ తోటల పెంపకం సాగింది. ఎపిఎఫ్‌డిసి ఆధ్వర్యంలో ఇటు పాడేరు, చింతపల్లి, చింతపల్లి సౌత్, ఆర్వీనగర్ ఈస్టు, ఆర్వీనగర్ వెస్టులలో ప్రస్తుతం 4012.18 హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మొత్తం లక్ష ఎకరాల్లో సాగుకు సిద్ధమైంది. ప్రతి హెక్టారుకు కనీసం 300 కిలోల కాఫీ దిగుబడి వస్తోందని చిక్‌మగ్‌లూరు, వాయినాడ్, ఎర్కాడ్‌ల స్థాయిలో అరకులో కాఫీ సాగు జరుగుతోందని, అస్సాం, డార్జిలింగ్, నీలగిరి, మున్నార్, కుర్గ్ స్థాయిలో సాగుకు చేరేందుకు ఎంతోకాలం పట్టదని అంటున్నారు. తాజాగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌తో అపెక్స్ అథారిటీని నియమించింది. ఇందులో ట్రైకార్ ఎండి, ఐటిడిఎ పిఓ, అగ్రి ఎకనామిస్ట్ , జిసిసి విసి ఎండి సభ్యులుగా ఉంటారు. పిఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదేళ్లకాలానికి ప్రభుత్వం నిధులు వెచ్చించేలా చర్యలు చేపట్టింది. కాఫీబోర్డు సబ్సిడీగా 160.36 కోట్లు ఇస్తుంది. టిఎహ్‌పి 364 కోట్లు ఇస్తుంది. లబ్దిదారుల వాటా 1.792 కోట్లు ఉంటుంది. అంటే ఏటా దాదాపు 36 కోట్ల రూపాయిల వరకూ రాష్ట్రప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ స్వల్పమొత్తాన్ని కూడా ప్రభుత్వం గిరిజన సబ్ ప్లాన్ నుండి సమకూర్చనుంది.