ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు స్వర్గ్ధామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: తూర్పుతీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గ్ధామమ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా సానుకూలాంశాలున్నాయని..పెట్టుబడులతో తరలిరావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపుృనిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేవారికి అన్ని విధాలుగా పరిపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఉగాది పర్వదినం రోజైన శుక్రవారం నాడిక్కడ చైనాకు చెందిన సిచువాన్ ప్రావిన్స్ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయు కుదిరింది. ఈ ఒప్పంద పత్రంపై చైనా సిచువాన్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ వాంగ్‌నింగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేసారు. దీని ప్రకారం పరిశ్రమలు, వాణిజ్యం, విద్య, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పెట్రోలియం, రసాయనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వౌలిక సదుపాయాల్లో సిచువాన్ పెట్టుబడులకు మార్గం సుగమనం అవుతుంది. రాష్ట్రానికి 974 కిమీ పైగా సముద్రతీరం వుందని, ఆరు డీప్ సీ వాటర్ పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులు ఉన్నాయని బాబు తెలిపారు. 45వేల కిమీ రహదారి, 7వేల కిమీ రైలుమార్గాలున్నాయన్నారు. అన్నింటికీ మించి రాష్ట్రంలో యువశక్తి అపారమని, ఇది అభివృద్ధికి అన్ని విధాలుగా సానుకూలమని తెలిపారు. ఇక్కడ వృత్తి నిపుణులు, ఇంజనీర్లు, మేనేజ్‌మెంట్ నిపుణుల సంఖ్య అధికమన్నారు. ప్రగతిశీల కార్మిక విధానాలతోపాటు బలమైన శాంతి భద్రతలున్నాయన్నారు. అభివృద్ధికి, ఎదుగుదలకు దోహదపడే సరైన పర్యావరణ వ్యవస్థ ఏపి ప్రత్యేకమన్నారు. ఈజ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ఏపికి ప్రపంచ బ్యాంక్ భారత్‌లోనే రెండో ర్యాంక్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసారు. మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు అప్పటికప్పుడు ప్రోత్సాహకాలు సిద్ధం చేస్తామన్నారు. ఇక్కడ పేరొందిన పారిశ్రామికవేత్తలున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలో మైక్రోసాఫ్ట్ సిఇవో నాదెళ్ల సత్య ఇక్కడివారేనన్నారు.
రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించడానికి ప్రణాళికలున్నాయని, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకే రాజధాని నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలంటూ సిచువాన్ ప్రావిన్స్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రైతులను ఒప్పించి రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాల భూసమీకరణ చేశామన్నారు. చైనాలో నదుల అనుసంధాన విధానం చాలా బాగుందంటూ దేశంలోనే తొలిసారిగా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసామన్నారు. రెండేళ్ల క్రితం 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా కేవలం రెండు నెలల్లోనే అధిగమించామని ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందన్నారు. కేంద్రం సహకారంతో నిరంతర విద్యుత్ సరఫరా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కనీసం ఏడాదికి ఒకసారి రాష్ట్రంలో పర్యిటిస్తే పనులు వేగవంతమవుతాయని అన్నారు. ఈ సదస్సులో వివిధ కంపెనీలకు చెందిన 40 మంది ప్రతినిధులు పాల్గొని సిచువాన్ ప్రావిన్స్ ప్రత్యేకతలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇదే సందర్భంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న సానుకూలతలు, ప్రత్యేకతలపై వివరించగా విద్యుత్ శాఖ, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ విద్యుత్ రంగం, రాజధాని అమరావతిలో వౌలిక సదుపాయాలు వివరించారు. కాకినాడ, శ్రీ సిటీ సెజ్, కృష్ణపట్నం సెజ్‌లపై సంబంధిత అధికారులు ప్రెజెంటేషన్లు ఇచ్చారు. భోజన విరామానంతరం వాంగ్‌నింగా, చంద్రబాబులు ఏకాంతంగా సమావేశమై కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
chitram..
చైనా ప్రతినిధులతో ఎంఒయు
పత్రాలు మార్చుకుంటున్న
సిఎం చంద్రబాబు