క్రీడాభూమి

బాడ్మింటన్‌కు అరవింద్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: బాడ్మింటన్ కెరీర్‌ను ముగిస్తున్నట్టు భారత షట్లర్ అరవింద్ భట్ ప్రకటించాడు. హైదరాబాద్‌లోని బాడ్మింటన్ అకాడెమీలో తీసుకున్న బాధ్యతలపై దృష్టిని కేంద్రీకరించాలన్న ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పాడు. ఇకపై తాను ఎలాంటి పోటీల్లో పాల్గొనబోనని తెలిపాడు. గత ఆరు నెలలుగా ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నానని, చివరికి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. తన కెరీర్ సంతృప్తికరంగా సాగిందన్నాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని 2011లో పారుపల్లి కశ్యప్‌ను ఓడించి జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న 36 ఏళ్ల అరవింద్ అన్నాడు. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో అతను పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లోని వైట్ పీకాక్ బాడ్మింటన్ అకాడెమీకి సలహాదరుగా వ్యవహరిస్తున్న ఈ బెంగళూరు ఆటగాడికి మరికొన్ని అకాడెమీల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. కోచ్‌గా స్థిరపడాలన్న ఉద్దేశంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సామర్థ్యానికి తగినంత గుర్తింపును సంపాదించుకోలేకపోయన అరవింద్‌కు కోచ్‌గా ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. అతను ఇప్పటికే కోచింగ్ పై ఆసక్తిని పెంచుకొని, అదే కొత్త కెరీర్‌గా మార్చుకోనున్నాడు.