మెయిన్ ఫీచర్

సుఖసంతోషాలనిఛ్చే తొలి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢమాస ఏకాదశి తొలైకాదశిగా వ్యవహర్తం. ఈ ఏకాదశి నాడే నరులను పాలించే నారాయణుడు క్షీరాబ్దివాసుడు శయని స్తాడని శయనైకాదశి అనీ పిలవడంకద్దు. మునులు, సిద్ధులు, సాధ్యులు సాధువులు సత్పురుషులు అందరూ హరి శయనించిన మహావిష్ణువును కీర్తిస్తారు కనుక, పైగా హరి దగ్గరే కాలయాపన చేస్తున్నారు గనుక హరి వాసరమనీ, ఈరోజు మంచినీరైనా సేవించకుండా కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశి అనీ రకరకాల విశేషాలతో విష్ణు భగవానుని అనుగ్రహాన్ని పొందిన ఏకాదశిని స్తుతిస్తారు. ఈరోజునే ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు దక్షిణం వైపుకు తిరిగినట్టుగాను కనిపిస్తాడు. ఈ ఏకాదశి గురించి వివరాలు భవిషోత్తర పురాణం బ్రహ్మవైవర్తన పురాణం చెప్తున్నాయ. పండరిపురంలో తొలైకాదశి నాడు పండరినాథునికి మహోత్సవాలు జరుపుతారు. రుక్మాంగద మహారాజు, అంబరీషుడు ఈ ఏకాదశీ వ్రతా చరణంతో విశేషఖ్యాతిని ఆర్జించారు. నారాయణ మంత్రాన్ని అనునిత్యం జపించిన వారికి ఈ లోకపు సంపదలతో పాటుగా వైకుంఠప్రాప్తి లభ్యమవుతుందని మహావిష్ణువు వరాన్ని ఇచ్చారు. ఈ ఏకాదశి తర్వాతవచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలూ లభిస్తాయ. మహా విష్ణువుకు కోసం పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. జాజిపూలతో స్వామికి పవళింపుసేవోత్సవం విశేషంగాచేస్తారు. ఈ జాజిపూల పవళింపుసేవ ఆలయాల్లో విశేషాకర్షణగా ఉంటుంది. ఈరోజు నుంచే వ్యవసాయదారులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడ్తారు ఆంధ్ర ప్రాంతంలో తొలి ఏకాదశిరోజునే పాలెర్ల పండుగగా చేస్తారు. పాలేర్లకు పంచభక్షపరమాన్నలతో విందుచేయడం, కొత్తబట్టలను ఇచ్చి గౌరవించడం లాంటివి చేస్తారు. సాధువులు చాతుర్మాస్య దీక్షల ను కూడా ఈరోజు ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస దీక్ష మార్గశీర్షం లోని మోక్షైకాదశి వరకు కొనసాగిస్తారు.
ఏకాదశి- గోపూజ
గోవు శరీరంలోనే సర్వదేవతలు, సర్వతీర్థాలు ఉన్నాయన్న నమ్మకంతో గోవిశిష్టతను పురస్కరించుకుని గోపద్మవ్రతం తొలైకాదశిన ఆచరిస్తారు. గోశాలను శుభ్రం చేసి ముప్పైమూడు పద్మాలముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి సంప్రదాయబద్ధంగా పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలతో ఇస్తారు. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా తులసిని సేవిస్తూ తులసి ముందర పద్మం ముగ్గువేసి దీపం వెలిగిస్తారు. జామ, ఖర్జూర, చెరుకు, సీతాఫలాల్లాంటివాటిని నివేదిస్తారు.

- జి. కల్యాణి