పర్యాటకం

వెలుగు చూసిన వాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగుళూరుకు చెందిన శ్రీ దేవదాయ కులకర్ణి దత్తాత్రేయ ఉపాసకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన పిఠాపురం పట్టణానికి విచ్చేసి గురు చరిత్రలో పేర్కొన్న శ్రీపాదుల వారి ఆలయం కోసం ఆరా తీశారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదులవారి దేవస్థానం లేదని తెలిసి ఆయన తీవ్ర విస్మయానికి లోనయ్యారు. పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయుల వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో అవతరించిన పవిత్ర భూమి పిఠాపురం అని, ఈ విషయం గురు చరిత్రయందు స్పష్టీకరించబడిందని కులకర్ణి స్థానిక పెద్దలకు వివరించారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదుల వారి దేవస్థానమేదీ లేదని, పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయుల వారి ఆలయం మాత్రం ఉందని పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్య శాస్ర్తీ ఆ ఆలయాన్ని కులకర్ణికి చూపారు. ఆలయ స్థితిగతులను చూసిన ఆవేదన చెంది బెంగుళూరుకు చేరుకున్న అనంతరం దత్తావధూతయైన భగవాన్ శ్రీ్ధరస్వామి శిష్యులైన సద్గురు సజ్జనగడ రామస్వామికి వివరించి ఆవేదన చెందారు. దీంతో రామస్వామి శ్రీమతి కమలమ్మగారితో కలసి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తొలిసారిగా 1966లో శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానమైన పిఠాపురం చేరుకున్నారు. కుక్కుటేశ్వరస్వామి వారి పవిత్ర పాదగయ క్షేత్రంలో రామస్వామి స్నానమాచరిస్తున్న సమయంలో దత్తాత్రేయులవారు దిగంబరుడుగా బాలక రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుండి రామస్వామి పిఠాపురంతో అనుబంధం పెంచుకుని పైండా రామారావు అధ్యక్షుడిగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం అనే సంస్థను స్థాపించారు. ఔదుంబర వృక్షాన్ని నాటిన స్థలానికి దగ్గరలో శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలను స్థాపించారు. ఈ ఆలయంలో మధ్యలో మూల స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుల వారిని, వారి కుడి భాగంలో వారి ప్రథమావతారులైన శ్రీ శ్రీపాద శ్రీ వల్లభుల వారిని, ఎడమ భాగంలో వారి ద్వితీయ అవతారులైన శ్రీ నృసింహ సరస్వతుల వారిని ప్రతిష్ఠించారు. మిక్కిలి మహిమాన్వితులైన ఇటువంటి ముమ్మూర్తుల దర్శనం ఏకకాలంలోనే ప్రాప్తించే ఏకైక దత్తక్షేత్రం ఇదే కావడం విశేషం! విశిష్టమైన చరిత్ర కలిగిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం సద్గురు రామస్వామి కృషి ఫలితంగా ఆవిర్భవించి నేడు దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

చిత్రాలు.. దత్తక్షేత్రం,
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వ్యవస్థాపకులు
సద్గురు రామస్వామి