Others

మనస్ఫూర్తితో చేసేసేవే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయం చేయడం ఉత్తమచర్యయైనా , కొంతమంది తమ వద్దకు సహాయార్థులై వచ్చినవారి యొక్క మానసిక స్థితినీ, సున్నితత్త్వాన్నీ, అభిమానాన్నీ చూడరు. పైగా వారేదో తప్పుచేసినట్లుగా చూస్తూ, వారి స్వయం కృతాపరాధాలవలనే వారాస్థితిలో వున్నట్లు వారిపై లేనిపోని అపరాధ భావాలను ఆపాదిస్తూ, తమలాంటి మనస్తత్వం, తమలాంటి జీవన విధానం వుంటే మీకిలాంటి స్థితి ఎందుకొస్తుందన్నట్లుగా మాట్లాడుతూ, తమ చూపులతోను, తమ ప్రవర్తనతోను వారిని క్షణక్షణం ఇబ్బంది పెడుతూ, చివరకు వారికి ఒక రకమైన మానసిక దౌర్భల్యాన్ని కలిగించి ఆ తరువాత తమకు తోచిన సహాయమేదో చేస్తారు. ఈ విధమైన స్వభావంతో చేసిన సహాయానికి ఏ మాత్రం విలువ లేకపోగా అహంకార పూరితమైన స్వార్థతత్త్వాన్ని బహిరంగపరుస్తుంది. ఏ మనిషి కూడా ఎదుటి మనిషి యొక్క అవసరాన్నీ బాధను పూర్తిగా ఏమీ తీర్చలేడు. తనకు చేతనైనంత, తనకు బుద్ధి పుట్టినంతవరకు అందుబాటులో వున్నంత మాత్రమే సహాయం చేయగలడు. అంత మాత్రానికి ఎదుటి మనిషి యొక్క అవసరాన్నీ, బలహీనతను ఆధారం చేసుకుని సమయం చిక్కింది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని అవమానరచడం ఏమనిపించుకుంటుంది? సహాయార్థుడై వచ్చిన సాటి మనిషికి సహాయం చేసే వీలు లేకపోయినా, అలా చేసే శక్తి లేకపోయినా అసలు సహాయం చేసేందుకు ఇష్టం లేకపోయినా ఆ విషయాన్ని అతనికి స్పష్టంగా చెప్పివేయాలి.
అంతేకాని నావల్ల కాదు అని మాత్రం చెప్పకుండా కేవలం తమ గొప్పలు మాత్రమే చెప్పుకుంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ చిటికెలతో పందిరివేస్తూ మాటిమాటికి తన వద్దకు అప్పుకు వస్తూ ఎదుటి మనిషిని మానసికంగానూ శారీరకంగానూ కృంగదీసేవాడినేమనాలి?
అదేవిధంగా భవిష్యత్తులో ఎక్కడో ఏదో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సహాయం చేసే దూరదృష్టి కలిగిన నీచులూ, సమయం సందర్భం చూడకుండా, లాభనష్టాలతో బేరీజు వేసుకుని మరీ సహాయం చేసే పాషాండులు కూడా వున్నారు. నేటి సమాజంలో గొప్పతనపు ప్రదర్శన ఉంది కాని మానవత్వం లేదు. తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం కోసం చేసే సేవ, తమ స్వార్థం కోసం చేసే సహాయం తప్పించి అందులో మానవత్వం, నిస్వార్థతత్త్వం వుండడం లేదు. పదిమందిలో గూటికీ, కూటికీ, గుడ్డకూ ఇబ్బంది లేని వందలమందికి అన్నదానాలు, వస్తద్రానాలు చేసి తమ గొప్పతనాన్ని పలు రకాలుగా ప్రదర్శించినవారు, తమ ఇంటి వాకిటికి అన్నార్తులు వస్తే ఈసడించుకుంటారు.
భగవంతుడిచ్చిన జీవితం చాలా చిన్నది. నూరేళ్ళ జీవితాన్ని పూర్తిచేసినా అది ఈ అనంతకాల గమనంలో బహు స్వల్పమే. అసలు ఎంతమంది నూరేళ్ళ జీవితాన్ని పూర్తిగా అందుకోగలుగుతున్నారు. భగవంతుడిచ్చిన జీవితం నూరేళ్లైనా, నూట ఇరవై ఏళ్ళు అయినా అది బహు స్వల్పకాలమే అవుతుంది. కనుక సత్ప్రవర్తనతో మనలాగే అందరూ అనే మానవత్వపు అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సంఘ జీవనం చేయాలి.
ఎవరికో ఏదో చేసేస్తున్నామని కాక తమకు తోచిన దాన్ని తమ సంతోషం కొరకు ఇతరులకు సేవచేస్తున్నామని అనుకొంటే కొంతలో కొంతైనా అహంకారం అంకురించకుండా ఉంటుంది. ఎదుటి వారి కళ్లల్లో కనిపించే ఆనందం చూస్తే చాలు ఎంతటివారినైనా కదిలించి ఆ ఆనందాన్ని ప్రతివారిలో చూడాలన్న ఆంకాక్షను పెంచు తుంది. కాని అదే భావన నేను వారికి ఆనందాన్ని కలుగచేస్తున్నాననే భ్రమ కలిగితే మాత్రం సాయం కాస్త చేస్తున్నవారిని అథఃపాతాళానికి నెట్టివేస్తుంది. కనుక తమకు సంతోషం కలగాలనేనెపంతో ఈసేవ చేస్తున్నానని అనుకొంటే కొంతమేలు.

-వాసిరాజు రామకృష్ణ