Others

ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలం.. ఆచనే్నశ్వర క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక చింతనకు ‘ఆచంట’ ఆలవాలం. ఇక్కడ స్వామి ఆచంటేశ్వరుడు. నిత్యం పరిసర ప్రాంతాలనుంచే కాకుండా సుదూర ప్రాంతాలనుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. ప్రతీ సోమవారంనాడు విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఇక్కడ అఖండ దీపాన్ని వెలిగించడానికి భక్తులు పోటీపడుతుంటారు. కాశీక్షేత్రం తర్వాత ఇక్కడే కార్తీక మాస అఖండ దీపం వెలిగించడం ఈ క్షేత్ర విశేషం.
రావణాసుర వధ జరిగిన పిమ్మట ఆ బ్రహ్మహత్యా మహాపాతకాన్ని వదిలించు కోవడానికి శ్రీరామచంద్రుడు ఈ స్వామిని దర్శించి, అభిషేకించి పూజలు జరిపారంటారు. కృతయుగాన వెలసిన స్వామివారికి త్రేతాయుగంలో జన్మించిన శ్రీరామచంద్రుడు అభిషేకం జరపడం ఇక్కడ విశేషం. తొలుత పంచారామాలలోని శైవక్షేత్రాలలో శివాభిషేకాలను జరిపిన శ్రీరాముడు క్షీరారామం (పాలకొల్లు)లో క్షీరా రామలింగేశ్వరుని దర్శనానంతరం ఇక్కడకు వచ్చారు. స్వామికి ‘రామలింగేశ్వరస్వామి’గా నామకరణం చేయగా ‘ఉమారామేశ్వరస్వామి’గా నాటినుండి పూజలందుకుంటున్నాడు.
సప్తసాగర సంగమక్షేత్ర ప్రాంతాన గౌతమి, వశిష్ఠగోదావరి పాయల మధ్య, వశిష్ఠ గోదావరి నదికి పడమటి ఒడ్డున ఆచంట గ్రామం ఉంది. ఈ క్షేత్రం పూర్వనామం ‘మార్తాండపురం’. ఈ క్షేత్ర మహిమలు హరివిలాసం, శివ వాఙ్మయం, కన్నడ వాఙ్మయంలో కథలుగా కనిపిస్తాయి.
ఈ స్థల పురాణంలో ఉన్న విశేషములు భక్తులను ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. తారకాసుర సంహారం అనంతరం శివపార్వతులు ఆనందపరవశంతో ‘తన్మయకేళీ విలాసం’లో తేలియాడుచుండగా తమకు శివసాయుధ్యం కోరేందుకుగాను ఓ మునిదంపతుల జంట అక్కడకు వచ్చి, పరోక్షంగా తిలకించడం జరిగింది. అందుకు కోపించిన శివుడు వారిని బాల బాలికలుగా చేసి, బ్రహ్మచర్యం పాటించినచో పిమ్మట కోరిన విధంగా శివసాయిధ్యం పొందెదరని ఆజ్ఞాపించెను. అయితే విధి విలాసముచే ఆ బాల బాలికలు శివాజ్ఞను విస్మరించడంతో శివుని శాపానికి గురయ్యారు. శాపగ్రస్థులయిన ఆ ముని దంపతులలో పుష్ప సుందరుడు భూలోకంలోని తిరువళ్లూరు గ్రామంలో బ్రాహ్మణుల ఇంట ‘ఒడయనంబి’గాను, పుష్పసుందరి మార్తాండపురం (ఆచంట) గ్రామంలో కళావంతుల ఇంట ‘పరమనాచి’గాను జన్మించారు.
తన పూర్వజన్మంలో లభించిన శాపాన్ని పోగొట్టుకోవడంకోసం ఒడయనంబి తీర్థయాత్రలు చేస్తూ మార్తాండపురం చేరాడు. పరమనాచి నిత్యం శివాలయంలో నృత్యప్రదర్శనలు చేస్తూ ఉన్నది. అక్కడ ఒడయనంబి, పరమనాచి కలుసుకోవడం, ఇరువురు ప్రేమానురాగాలను ఒలకబోసుకోవడం జరిగినా నిరంతరం ఈశ్వర సేవలోనే నిమగ్నమై ఉండేవారు.
ఓ శివరాత్రి పర్వదినాన ఒడయనంబి మిత్రునితో కలసి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునస్వామిని ఆరాధించాలని సంకల్పించినా, ఒడయనంబి వెళ్లలేకపోయాడు. అతని మిత్రునికి ఆ అవకాశం లభించింది. అతను శ్రీశైలమున మల్లికార్జునుని దర్శిస్తూ, లింగోద్భవ సమయాన ‘ఈ సమయమున తన మిత్రుడు ఒడయనంబి తన విలాసవతి చెంత సుఖించుచున్నాడని’ తలపోశాడు.
కానీ, మార్తాండపురములో జరిగినదేమిటంటే, తన ప్రియసఖి ప్రక్కన శయ్యపై పరుండియూ శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలమున భక్తిగా తన ఇంతియొక్క స్థనాగ్రంబునే శివలింగముగా భావన చేసి పన్నీటితో అభిషేకము సల్పి, గంధమును అద్ది, పూలమాలలు చుట్టి యధావిధి కొలిచాడు.
ఇంతి ప్రక్కలో శయనించియున్నా శివభక్తిని విడువక, శివరాత్రిని మరువక శివపూజను సల్పిన అతని ఏకాగ్రతాచిత్తానికి మెచ్చిన శివుడు వారి ఇరువురికీ ఏకకాలమున శివసాయుధ్యమును ప్రసాదించాడు.
ఆ భక్త సులభుడైన శంకరుడు తన ప్రతిరూపాన్ని ఇంతి స్థనాగ్రమున కాంచిన ఒడయనంబి (పుష్పసుందరుడు) సాక్షిగా మార్తాండపురం కాస్తా ‘ఆచన్ను’పురంగా, తదుపరి ఆచనే్నశ్వరంగా, ప్రస్తుతం ఆచంటగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలంలో స్వామివారిని ఎవరు దర్శిస్తారో, వారియొక్క మనోభిష్టాలు నెరవేరి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ కథనాలు చెబుతున్నాయి.

- యన్.కె.నాగేశ్వరరావు