మెయిన్ ఫీచర్

శివనామం..మంగళకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే,
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’
అని స్తుతించబడిన ఆదిదంపతుల్లో సర్వమంగళ అయిన పార్వతి జగజ్జనని, సకల శుభంకరుడు శంకరుడు జగత్పిత. ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు. శివా అని నోరారా పిలిస్తే చాలు, చెంబుడు నీళ్లు ఆ శివలింగంపై గుమ్మరిస్తే చాలు, మారేడు దళాన్ని యథాలాపంగా వేసినా చాలు సంతోషంతో శివుడు అపారమైన సంపదలనిస్తాడు. శివ నామమే మంగళకరము. దేవదానవులు అమృతోత్పాదనకోసం పాల సముద్రాన్ని మధించగా హాలాహలం పుట్టింది. లోకాలన్నీ ఆ విషాగ్నిలో మాడిపోతాయేమన్న బెంగ సర్వులకు కలిగింది. పరమేశా నీవే దిక్కు అని వారు వీరు అన్న తేడా లేక తమను రక్షించమని వేడుకున్నాడు.
వారి దీనాలాపాన్ని విన్న భక్తవరదుడు, భక్తవత్సలుడు కైలాసవాసుడు తన కంఠాన ఆ హాలాహలాన్నంతా పట్టి ఉంచి సర్వలోకాలను కాపాడాడు. అందరూ ఆ శివుడిని పార్వతీ ప్రియుడ్ని చూచి ‘నీలకంఠేశ్వరా పాహిమాం పాహిమాం’ అని ఎలుగెత్తి నామస్మరణ చేశాడు. అటువంటి చంద్రశేఖరుడ్ని ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి, జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి, తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి, నందివర్థనంతో పూజిస్తే సౌందర్య ప్రాప్తి, నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి, గనే్నరు పూలతో పూజిస్తే శత్రునాశనం, శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషం కలుగుతుందని పురాణాలు చెప్తాయ.
శివుడు శక్త్యాత్మకుడు. అర్ధనారీశ్వరుడు ప్రేమమయుడు అయన శివుడు లింగాకారంలో మాఘ బహుళ చతుర్దశినాడు ఉద్భవించాడు. ఆ రోజుననే మహాశివరాత్రి ఉత్సవాలు అన్ని శివాలయాల్లోను జరుపుతారు. శైవులంతా శివనామస్మరణతో తమ జన్మలను పునీతం చేసుకుంటారు. జనులంతా అభిషేక ప్రియుడైన శివుడ్ని నానావిధ ఫలపరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకిస్తారు.
ఈ శివరాత్రి దినోత్సవ ప్రాముఖ్యతను భవిష్య, లింగపురాణాలు వివరిస్తున్నాయ. శివరాత్రినాడు అపమృత్యుభయంఉన్నవారు పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే, సంతుష్టాంతరంగుడైన ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం చెప్తుంది. సర్వసంపదలు వృద్ధిపొందడానికి కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయాలి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అన్నట్టుగానే అభేదులైన శివకేశవులను ఈ శివరాత్రి రోజున పూజించినవారికి ఈలోక సంపదలేకాక అంత్యమున శివ సాయుజ్యం లభిస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ శివ తత్వాన్ని ఎరుకపరుస్తుంటుంది. పర్వతాలు, నదీనదాలు, ఘనీభవించి నట్టుండే మంచు, సూర్యచంద్రులు ఇట్లా అన్నీ శివునిలోని మహోన్నత గుణాలను వెల్లడిస్తూ సర్వశివమయమే నన్న భావనను వ్యక్తం చేస్తున్నాయ. వీటిని అర్థం చేసుకొన్న మానవునకు శివారాధన జన్మను సార్థక్యం కలిగిస్తుంది. .... ‘‘మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ, మేటి పెద్దమ్మ’’ అని సంబోధించిన రుక్మిణీదేవి తన అన్న, తండ్రుల దగ్గర నుంచి రక్షించి తనకు రేపల్లెవాసుడు ద్వారకాధీశుడు గోపీజనలోలుడు అయన ‘‘హరింపతిం చేయంగదమ్మ రుూశ్వరీ’’ అని పార్వతీదేవిని ప్రార్థించి శ్రీకృష్ణుణ్ణి చేపట్టింది.
శరీరంపై వ్యామోహాన్ని పోగొట్టుకోవాలనుకునేందుకు విభూది సంకేతం. శివుడి త్రినేత్రం జ్ఞానానికిసంకేతం. సత్వ రజో తమోగుణాలు త్రిగుణాలు. శివుని చేతిలోని త్రిశూలం త్రిగుణాలకు ప్రతీక. త్రిశూలాన్ని ధరించిన శివుడు త్రిగుణాలను నియంత్రణంలోకి తెస్తాడు. డమరుక ధ్వని నుంచి ప్రతిధ్వనించే శబ్దంనుంచే ఓం కారం వినిపిస్తుంది. మార్పులేకుండా ఎప్పటికీ నిలిచి ఉండేదేఒక్క ఓంకారమే ఆ ఓమ్ కార స్వరూపుడే శివుడు. కనుక శివరాత్రిరోజు పార్ధివ లింగానికి పూజాభిషేకాలు చేసిజాగరణ చేస్తూ మొదటి జాములో పాలతోను, రెండవ జాములో పెరుగుతోను, మూడవ జామునందు నెయ్యితోను నాల్గవ జామునందు తేనెతోను అభిషేకాదులు జరిపి లక్ష బిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబు తున్నాయ.
ఓం ‘నమశివాయ’ ఈ శివ పంచాక్షరిని పల్కినా, లేక విన్నా శివదర్శనభాగ్యం కల్గినంత పుణ్యమని పెద్దల వాక్కు. కనుక శివరాత్రినాడు అందరూ శివనామంజపంతో పునీతులమవుదాం.

- హనుమాయమ్మ