Others

విజ్ఞానాంశాలను చెప్పే యాత్రాదీపిక-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాత్రాదీపిక -7
మెదక్, పరిసర ఆలయాలు
రచన: పి.ఎస్.ఎమ్. లక్ష్మి
మూల్యం: రూ.50/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం

భారతదేశం పుణ్యభూమి. కర్మభూమి. ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించారు. అరుదుగా అమూల్యంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోమని సామాన్యజనావళికి ఎన్నో బోధలు గావించారు. దేవాలయాలు చైతన్యకేంద్రాలు. మానవతావిలువలను పెంచే విద్యాలయాలు. నరుల్లో నారాయణుని అంశను చూడమని చెప్పే విజ్ఞానకేంద్రాలు. అట్లాంటి దేవాలయాలు అనేక మంది రాజులను దేవాలయాలను నిర్మించారు. దేవాలయాల ద్వారా మానవజీవన ప్రగతికి బాటలు వేసారు. కాలంలో వచ్చే మార్పులు దేవాలయాలు జీర్ణావస్థలోకి నెట్టిశాయి.
అపురూప శిల్పసౌందర్యంతోను, అనేక రహస్యవిజ్ఞానకోశాలుగా ఉన్న దేవాలయాలను నేటి ప్రపంచీకరణతో పట్టించుకునేవారు లేక శిథిలావస్థలోకి వెళ్లిపోతున్నాయి.
అటువంటి దేవాలయాలను తిరిగి పునరుర్ధరించి అందులో దాగిన విజ్ఞానాంశాలను కనుగొని మానవ ప్రగతికి దోహద చేయాలనే దృక్పథంతో పి.ఎస్.ఎమ్. లక్ష్మి చేతనైనంత వరకు దేవాలయాలను సందర్శించి వాటిలో తనకు కనిపించిన దేవాలయాల గురించి చెప్పే స్థలపురాణాలకు, ఆ దేవాలయ కుడ్యశిల్పసౌందర్యాలకు అక్షరరూపు నిచ్చి పరిశోధకులకు ఆసక్తిని కలిగిస్తున్నారు. యాత్రాదీపిక పేరుతో ఆవిష్కరించే ఈ పుస్తకాలు అటు ఆధ్యాత్మిక పరుల్లో భగవంతుని గూర్చిన జిజ్ఞాసను, ఇటు పరిశోధకులకు ఆసక్తిని కలిగించేవిధంగా ఉన్నందున సాహితీలోకం ఈ పుస్తకాలకు ఆహ్వానం పలకాలి. యాత్రాదీపిక -7 చదివించే నేర్పున్న అక్షర రమ్యతను కలిగిన ఈ పుస్తకం చదువరుల అభిమానాన్ని చూరగొంటుంది.

- చరణ శ్రీ