ధర్మసందేహాలు

మంగళ, శుక్రవారాలు పనికిరావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్ర్తిలు పుట్టింటినుండి మెట్టినింటికి మంగళవారం, శుక్రవారం వెళ్ళరాదంటారు ఎందుకు?
- వి.రామలింగాచారి, యాదగిరిగుట్ట
ఇది ఒక ప్రాంతీయాచారం మాత్రమే. ఆడపిల్ల లక్ష్మీ స్వరూపిణి కనుక లక్ష్మీదేవిని మంగళ శుక్రవారాలలో ఒదులుకోరాదనే భావనతో ఈ ఆచారం ఏర్పడి వుంటుందని పెద్దలు అంటున్నారు.
* అన్నయ్యను కాదని, శ్రీరామచంద్రుని చెంతకుచేరి, ఇంటి గుట్టుతో చేటు తెచ్చిన విభీషణుడు గొప్పవాడా? మోసగాడా? - పాపారావు, బూరగావ్
విభిషణుడు మోసగాడు ఎంతమాత్రమూ కాదు. అన్నగారు చేసేది తప్పని అనేకసార్లు బహిరంగంగా చెప్పి చూశాడు. చివరికి అన్నగారు గెంటేస్తే, అప్పుడు వచ్చి శ్రీరామ శరణాగతి చేశాడు. అది కూడా తన స్వార్థంకోసం కాకుండా, ధర్మరక్షణకోసం ఆ పని చేశాడు. అందువల్ల విభీషణుడు గొప్పవాడే.
* ఆకాశం ఇంత విశాలంగా కనిపిస్తుంటే, దీన్ని సూక్ష్మం అని కొందరు ఎలా అంటున్నారు? - దత్తాత్రేయ, రామనగర్‌గుండు,
సూక్ష్మం అనే పదానికి నిర్వచనం తెలుసుకుంటే మీకీ ప్రశ్న పుట్టదు. ఏదైనా పదార్థంయొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవాలంటే మనకు ఆరు ఇంద్రియాలు సాధనంగా పనిచేస్తాయి. అవే పంచజ్ఞానేంద్రియాలు మరియు మనస్సు. వీటిలో ఒక్కొక్క పదార్థాన్ని అనేక ఇంద్రియాల ద్వారా గ్రహించే వీలుకూడా వుంటుంది. ఏ పదార్థామైతే ఎక్కువ ఇంద్రియాలచేత గ్రహించబడుతుందో అది స్థూల పదార్థం. ఉదాహరణకు భూమి అనే పదార్థాన్ని అయిదు ఇంద్రియాలతోనూ గ్రహించవచ్చు. అందువల్ల అది స్థూలతమ పదార్థము. ఆకాశమనేది పంచజ్ఞానేంద్రియాలలో దేనికీ దొరకదు. ఇంటి నేల దగ్గర్నుంచి, ఇంటి కప్పుదాకా మధ్యలో ఏ పదార్థము కనిపించటం లేదు కనుక అక్కడ ఆకాశం వుంది అని మనం మనస్సుతో వూహించగలుగుతున్నాం. అంటే ఆకాశాన్ని గ్రహించగల ఏకైక ఇంద్రియం మనస్సు. అందువల్ల ఆకాశమనేది అతి సూక్ష్మ పదార్థమని పెద్దలు నిర్ణయించారు.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి