ధర్మసందేహాలు

దేవాలయం నిర్మించుకోవడం మంచిదా? చెట్టు తొలగించడం మంచిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యాగము, హోమము, యజ్ఞము అంటే ఏమిటి?
- ఇ.వి.సంతోష్‌కుమార్, అద్దంకి
ఇంచుమించు ఒకటే గానీ పూర్తిగా ఒకటి కాదు. సంగ్రహంగా చెప్పాలంటే- ఒకే ఒక దేవతను ఉద్దేశించి చేసే అగ్నిపూజను హోమము అంటారు. అంగదేవతా, పరివార దేవతా సమేతంగా ఒక దేవతా బృందం యొక్క ప్రీతికోసం చేసే హోమాన్ని యాగము అంటారు. అనేకమంది ప్రధాన దేవతలను స్వీకరించి, వారికోసం చేసే యాగాన్ని యజ్ఞము అంటారు.
* రుద్రయాగము, అతిరుద్రయాగము ఒకటేనా? వీటిని మన ఇంట్లో చేసుకోవచ్చునా? వీటికి ఫలితమేమిటి? - వేంకటేశ్వర్లు, సూర్యాపేట
రుద్రనమకాన్ని 11సార్లు ఆవృత్తి చేసి హోమం చేస్తే అది రుద్రయాగం అవుతుంది. 11న11న11=1331సార్లు ఆవృత్తి చేసి హోమం చేస్తే అది అతి రుద్రయాగం అవుతుంది. ఈ రెండు యాగాలకు కూడా అనేక అంగోపాంగాలున్నాయి. వీటినన్నింటినీ నిర్వహించేటంతటి చోటు, సహాయ సంపత్తి, వగైరాలు ఇంట్లో వుంటే మన ఇంట్లోనే చేసుకోవవచ్చు. పరమేశ్వరుడియొక్క అపార కరుణాప్రవాహంతో సర్వకార్యసిద్ధి ఈ యాగాలకు ఫలితం.
* మావూరి దేవాలయంలో రావి చెట్టు క్రింద నవగ్రహ దేవాలయం కట్టారు. రావిచెట్టు పెరిగి పెద్దదై నవగ్రహ దేవాలయం శిథిలమైపోతోంది. మేము ఇప్పుడు రావిచెట్టును తొలగించాలా? నవగ్రహాలయాన్ని పునఃనిర్మించుకోవాలా?
- ఎస్.అప్పారావు, సారవకోట
పూజలు చేసే రావిచెట్టును కొట్టేయడం మంచి విషయం కాదు. అవసరమైన మేరకు కొమ్మలు కొట్టివేయవచ్చు. నవగ్రహాలయం మరీ శిథిలమైపోతే దాన్ని పునఃనిర్మించి, పునఃప్రతిష్ఠ చేయించుకోవడం మంచిది.
* తెలుగు భాషకు మూల భాష ఏది?
- బి.రామచంద్రరావు, సికిందరాబాద్
‘‘జనని సంస్కృతంబు సకల భాషలకును’’ అని బహుభాషా కోవిదుడు కృష్ణదేవరాయలు నిర్ణయించి చెప్పేశాడు. పాశ్చాత్యుల దురుద్దేశపూరిత భాషా సిద్ధాంతాల యొక్క మూలాలు అసత్యాలని ఇటీవల క్రమక్రమంగా నిరూపణ అవుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల సిద్ధాంతమే సరి అయినది.
* ఈ భూమండలాన్ని జంబూద్వీపమని ఎందుకు అన్నారు? - లక్ష్మి, సికింద్రాబాద్
సృష్టి ప్రారంభ దినాలలో భూమి అంతా ఒకే ఖండంగా వుండి, మిగిలిన జలభాగమంతా ఒకే జలండంగా ఉండేది. అలా భూమి చుట్టూతా సముద్రము వుండటంవల్ల భూమికి ద్వీపం అనే పేరు వచ్చింది. సృష్టికి
ప్రారంభ దినాలలో ఈ భూమిమీద జంబూవృక్షాలు ఎక్కువగా ఉండటంవల్ల దీనికి జంబూద్వీపం అనే పేరు వచ్చిందని మహాభారతం చెపుతోంది.
* రాధాకృష్ణుల సంబంధాన్ని వివరించండి?
- నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం వైకుంఠలోకానికి పైన వున్న గోలోకంలో, అక్కడి రాసమండలానికి అధినేత్రిగా ఉండే రాధాదేవి శాప ప్రభావంవల్ల భూలోకంలో వృషభానువు అనే క్షత్రియుడికి పుత్రికై పుట్టింది. ఈమె శ్రీకృష్ణుడికి మేనత్త వరస అవుతుంది. ఆమె పూర్వ సంస్కార బలంచేత శ్రీకృష్ణుని ప్రేమించింది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రత్యక్షమై రాధాకృష్ణుల వివాహం జరిపించి, రాధాదేవికి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజెప్పి, ఆ వివాహం రోజునే ఆమె చేత వానప్రస్థదీక్ష స్వీకరింపజేశాడు. అప్పట్నించి రాధాదేవి ఆజన్మ బ్రహ్మచారిణిగా జీవిస్తూ శ్రీకృష్ణుడితో ఆధ్యాత్మిక రాసక్రీడలను అవిచ్ఛిన్నంగా కొనసాగించి ముక్తి పొందింది.
* వామనుడు ఒక పాదంతో మొత్తం భూమిని ఆక్రమించుకున్నాడని అన్నారు గదా! అంటే బలి చక్రవర్తి ఈ భూమండలాన్నంతటినీ పాలించాడా?
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
వామనావతారంలో శ్రీహరి చూపించింది ఒకరకమైన విరాడ్రూపం. అక్కడ ఒక పాదంతో భూమిని వ్యాపించడం అంటే, తన తేజోమయమైన రూపము యొక్క విస్తారాన్ని ప్రదర్శించడమేనని మనం గ్రహించాలి.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి