ఆరోగ్య భాగ్యం

బాల్య వివాహాలు ఎందుకు చేటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలికలకు 11-14 సం. వయసులో జననేంద్రియాల పరిణతి వచ్చినప్పటికీ వారి శరీరం ఇంకా ఎదుగుదలలోనే ఉంటుంది. అంటే మిగతా శరీరంలోని గ్రంథులు (ఎండోక్రయిన్స్) ఎముకలు పెరుగుతూ ఉంటాయి. వారి పొడుగు ఇంత అని అప్పుడే నిర్ణయించలేము. ఇంతేకాక వారి మెదడు - అంటే మానసిక పరిపక్వత, ఆలోచనా విధానం ఇంకా ఎదిగే స్థితిలోనే ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి లాంటివి ఇంకా పరిపూర్ణ వికాసాన్ని పొందకపోవచ్చు. వారికి ఆసక్తి ఉన్న విషయం ఏదో వారే నిర్ణయించుకోవాలి. సంగీతం, కవిత్వం, నాట్యం, చిత్రలేఖనం వంటి కళలు లేక వంట, ఇంటి పని, లేక ఆటలు, పోటీలు, ప్రపంచాన్ని చూద్దామనే ఆసక్తి వంటివి మెల్లమెల్లగా కలుగుతాయి. అప్పుడే వివాహం, సెక్స్ వంటి ఆలోచనలు వారికి వుండవు.
అటువంటి సమయంలో బలవంతాన వివాహం, దాని బాధ్యతలు వారి నెత్తిన మోపడం సరికాదు. వారికి 18-20 సం.లకి ఎముకల పెరుగుదల త్వరగా వుండి 25 సం. వయసు వరకు మెల్లగా జరుగుతుంది.
వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల చాలామందికి రక్తహీనత, బలహీనత, మందకొడిగా వుండటం ఆహార లోపం వల్ల ఏర్పడతాయి. ఆ సమయంలో పెళ్లి చేసి వారికి గర్భం వస్తే చాలా ప్రమాదాలు, గర్భస్థ శిశువుకి కూడా పైవన్నీ సంక్రమిస్తాయి. తరువాతి తరం ఇంకా బలహీనంగా తయారవుతారు.
వీరికి ఎనీమియా - రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, వాపులు, ఫిట్స్, తలలోని రక్తనాళాలలో వైపరీత్యాలు వస్తాయి. ఎముకల నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి కాల్షియం, విటమిన్లు ఆహారం నించి వారి శరీరానికే అవసరం. అటువంటప్పుడు కడుపులోని శిశువుకి, గర్భం నిలవడానికి ఎలా సాధ్యమవుతుంది? కనుక శరీర నిర్మాణం పూర్తి అయిన తర్వాత అంటే 20-25 సం. వయసులో పెళ్లిచేస్తే ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు కలుగుతారు. ఔన్సు సిండ్రోము వంటి జెనెటిక్ వ్యాధులు సంక్రమిస్తాయి. వీరు అత్తవారింటికి వెళ్లే ఆచారం మనకి ఉంది కాబట్టి అకస్మాత్తుగా కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారపు టలవాట్లు జీర్ణించుకోలేక పోతారు. చిన్నమొక్కని పీకి వేరే చోట పాతినట్టు నూటికి నూరు శాతం ఇమడలేక పోవచ్చు. దానితో అత్తా కోడళ్ల విభేదాలు, భర్త మామల అధికారపు చలాయింపు జీర్ణం చేసుకునే పరిణతి బాలికలకు వుండకపోవచ్చు.
లేక పూర్తిగా వారికి వశమై పోయి తమ వ్యక్తిత్వం కోల్పోయి కేవలం పెంపుడు జంతువులాగ తయారవవచ్చు. ఇది మంచి పురోగతి కాదు. వారిలో ఎంతోమంది క్రీడాకారిణులు, వృత్తిలో పైకి రాగలిగినవారు, నాయకత్వ లక్షణాలు నాశనమై పోవచ్చు.
అదే కొంచెం శారీరకంగాను, మానసికంగాను పరిణతి చెంది వివాహానికి సుముఖంగా తయారైతే వారి వ్యక్తిత్వ వికాసమే కాక అత్తవారికి కూడా మంచి పేరు తెచ్చే కోడళ్లుగా తయారవుతారు.
ఇక కాన్పు సంగతికి వస్తే ఎముకల గూడు పెల్విసు వంటివి చిన్న సైజులో వుంటే సి.పి.డి. అంటే పాప తల దూరేంత ఎముకలు వుండవు. కష్టకానుపు. వివిధమైన గాయాలు దీర్ఘకాలిక సమస్యలే కాక శిశువు మృతి చెంది తల్లి ప్రాణానికి అపాయం కలుగవచ్చు.
కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహించి వారి కుమార్తె ఆశలు, ఆశయాలు అర్థం చేసుకుని అనుగుణంగా వారిని తీర్చిదిద్ది వారు మానసికంగా వివాహానికి సిద్ధపడినప్పుడే వివాహం చేయాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల కష్టసుఖాలపై దృష్టి పెట్టి గొంతెమ్మ కోరికలు కోరకుండా తగిన వరుణ్ని ఎంచుకోవాలి. బాల్యంలోనే వీలైనన్ని విద్యలు, కళలు నేర్చుకోవాలి. ఎవరైనా బాల్య వివాహం అంటే 18 సం. ముందు బలవంతపెడితే తిన్నగా ‘షి’ టీముకి గాని, దగ్గరున్న పోలీసుస్టేషన్‌కి గాని వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికీ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉండడం చాలా దౌర్భాగ్యం. ఇవి జరుగుతున్నాయని తెలిస్తే చుట్టుపక్కల వున్న పౌరులు పోలీసులకు ఫోన్‌లో చెప్పవలసిన అవసరం ఉన్నది.
=========================
నాగమణి (గోదావరిఖని)
ప్రశ్న: మా అమ్మాయికి 12 సంవత్సరాలు. ఎప్పుడూ నీరసంగా పడుకునే వుంటుంది. ఆకలి లేదంటుంది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులే వస్తాయి. నేను కూర్చోబెట్టి చదివించినా జ్ఞాపకం లేదనీ, పరీక్షల్లో రాయలేదంటున్నది. లావుగానే ఉంటుంది. అప్పుడప్పుడు కాళ్లు, మొహం ఉబ్బుగా ఉంటోంది. డాక్టర్‌కి చూపిస్తే ఏమీ లేదు. మంచి ఆహారం ఇమ్మంటారు. రక్తం శాతం 8 జిఎం ఉంది.
జ: మీ పాప లక్షణాలు చదివితే చాలా రక్తహీనత ఉందని తెలుస్తోంది. దానివల్లనే మెదడుకి రక్తం ఆక్సిజన్ సరఫరా తక్కువై తెలివితేటలు తగ్గాయి. తర్వాత థైరాయిడ్ పరీక్షలు చేయించండి. థైరాయిడ్ తక్కువగా అంటే 5-5.5 యూనిట్ల కంటే టి.ఎస్.హెచ్. పరిమాణం ఎక్కువైతే నోటి బిళ్లల ద్వారా థైరాయిడ్ ఇవ్వండి. రక్తం తక్కువైతే నోటి మాత్రలు, ఐరన్ టానిక్‌లు, ఇంజక్షన్లు చాలా వున్నాయి. మీ గైనకాలజిస్ట్ చెప్పినట్టు వాడండి. ఏమీ ఫర్వాలేదు. ఆరోగ్యం చక్కబడుతుంది.
=========================
*

-- డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో