ఆరోగ్య భాగ్యం

ఎముకలు విరుగుతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు అనేవి అస్థిపంజరం బలం. వీటి ఆధారంగానే కండరాలు, నరాలు, శరీరం, అవయవాలు, చర్మం, రక్తం లాంటివి మనిషి రూపాన్ని తయారుచేస్తాయి. అయితే పుట్టినపుడు వందల్లో వుండే ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి బలమైన ఇనుపరాడ్లలాగా తయారవుతాయి. మనిషి నిలబడటం, నడవడం, కూర్చోవడం, బరువులు మోయడం, వంగడం వంటి పనులను తనకు నచ్చినట్టు చెయ్యగలుగుతాడు.
బాల్యంలో మంచి ఆహారం, కాల్షియం, ఐరన్, జింకు లాంటి ధాతువులు తీసుకుంటే ఎముకలు బలంగా పెరుగుతాయి. పెద్ద వయసులో కూడా అస్థిపంజరం బలంగా వుంటుంది. అయితే పెద్ద వయసులో ఏమవుతుంది? ‘గుల్ల ఎముకల వ్యాధి’ అంటే అందరూ అనే మాట ‘ఆస్టియోపోరోసిస్’. ఈ సమస్య వృద్ధాప్యంలో తప్పదా? ఈ మార్పు ఒక రకమైన వ్యాధి. ఆడవారిలో ఎక్కువగాను, పురుషుల్లో కొంచెం తక్కువగాను కన్పిస్తుంది. దీనికి కొన్ని కారణాలు..

----------------------------------------------------------------------------------------
1.పురుషులలోని హార్మోనులు చాలా పెద్ద వయసు వరకు నిలువ వుంటాయి. స్ర్తిలలో ఈస్ట్రోజను హార్మోను 40-45 సం.ల వయసుకే చాలా తగ్గిపోతుంది. దాంతో వారి ఎముకలు పలుచగా అయిపోతాయి. దీనికి తోడు పురుషులు చాలా వయసుదాకా పనిపాటలు, తిరగడం, బరువు పనులు చేస్తూ చురుకుగా ఉండడం వల్ల వారి ఎముకలు గట్టిగా శక్తివంతంగా వుంటాయి. స్ర్తిలలో ఫిజికల్ యాక్టివిటీ అంటే శరీర వ్యాయామం చురుకుదనం తక్కువనే చెప్పాలి. దాంతో అసలే ఈస్ట్రోజన్ లేమివల్ల పలుచబడిన ఎముకలు చిన్న శ్రమకే పుటుకు పుటుకుమని విరిగిపోతాయి.
వెనె్నముకలో ఎముకలు, తుంటి ఎముకలు, ముంజేతి ఎముకలు సులువుగా విరుగుతాయి. తుంటి ఎముక విరిగితే జీవితం దుర్భరం అవుతుంది. ఐతే ఆధునిక పద్ధతులలోని సర్జికల్ విధానాలు కాలి తొడలోను, మడిమలలోను ఇనుము, టైటానియం వంటి బలమైన ధాతువులతో తయారుచేసిన రాడ్స్ పెట్టి మామూలుగా నడిచేట్టు వైద్య నిపుణులు చేస్తున్నారు. చికిత్సతో కాలు పొట్టి, పొడుగు లేకుండా మామూలుగా వుండేట్టు చేయగలుగుతున్నారు. ఆపరేషన్ తర్వాత మూల కూర్చోకుండా ఫిజియోథెరపీ, మానసిక దారుఢ్యం పెంచడం ద్వారా మానవాళికి మేలు జరుగుతోంది.
ఆస్టియోపోరోసిస్ రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? నూటికి 80 శాతం స్ర్తిలలోనే ఈ గుల్ల ఎముకల వ్యాధి కలుగుతుంది కనుక చిన్న వయసు నుంచీ స్ర్తిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం.
మొదటిగా ఆడపిల్లలకి మంచి సమతులాహారం పాలు, పెరుగు, కూరలు, గింజ ధాన్యాలు చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. చక్కగా ఆటలు ఆడుకోవడం, శరీర వ్యాయామం, ఎన్‌సిసి ట్రైనింగ్ లేక పరుగు పందాలు, పరిగెత్తే ఆటలు, నృత్యం లాంటి కళలు నేర్పించాలి. వాళ్లని స్వేచ్ఛగా పెరగనివ్వాలి. చీటికిమాటికి కార్లు, స్కూటర్లు కాకుండా దగ్గర వున్న ప్రదేశాలకు నడిచి వెళ్లిరావడం అలవాటు చేయాలి. స్విమ్మింగ్, బాడ్మింటన్, టెన్నిస్, చెడుగుడు, క్రికెట్ లాంటివి ఆడడాన్ని అడ్డుచెప్పరాదు. యోగ, సూర్యనమస్కారాలు వంటి ఎక్సర్‌సైజులు మంచివి. వారికి థైరాయిడ్, రక్తహీనత వంటి వ్యాధులు రాకుండా చూడాలి.
తర్వాతికాలంలో ఎక్కువ సంతానం కల్గిన వారికి కాల్షియం, విటమిన్-డి వంటివి ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వాటి మోతాదు డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎంతకాలం పిల్లలకి స్తన్యపానం తాగిస్తారో అన్ని రోజులూ వారికి కాల్షియం, విటమిన్లు అవసరం.
ఇక మెనోపాజ్ సమయం ముందు అంటే 40 సం.ల వయసు నుంచీ బోన్స్ పరీక్ష బిఎండి చేయించాలి. డాక్టర్ల సలహాతో చికిత్స చేయించాలి.
కొంతమందికి ఆపరేషన్లు అంటే గర్భాశయం దాని ప్రక్కన వుండే ఓవరీలు తీసివేయవలసి వస్తుంది. అపుడు చాలా త్వరగా ఈస్ట్రోజన్ నశించిపోతుంది. వారికి ఆస్టియో పోరోసిస్ రాకుండా తగిన మందులు స్పెషలిస్టులు ఇస్తారు. అసలు వీలైనంతవరకు సర్జన్లు ఓవరీలు తీయారు. వాటికేదైనా వ్యాధులు లేక కంతులు వస్తే తీసివేయక తప్పదు కదా! ఈస్ట్రోజను రెండు వైపులా పదునున్న కత్తివంటిది. దానిని జాగ్రత్తగా ఏ మార్గాన వాడాలో వైద్య నిపుణులు నిర్థారిస్తారు. అంటే నోటి మాత్రలు లేక ఇంజెక్షన్లు, లోపల పెట్టుకునే బిళ్లలు, శరీరానికి అతికించుకునే స్టిక్కర్లు ఇలా చాలా విధాలున్నాయి.
పెద్ద వయసులో స్ర్తిలకు, పురుషులకు కాల్షియం కావాలి. మన ఆహారంలో ఏవి తింటే కాల్షియం లభిస్తుందంటే పాలు, పెరుగు, మిల్క్ పౌడర్లు, డ్రైఫ్రూట్స్- బాదం, పిస్తా, వేరుశెనగ- ఇవేకాక రాగులు, సోయా గింజల, సజ్జలు వంటి పప్పు ధాన్యాలు- మినుములు, పెసలు, మినప్పప్పు శాకాహారులకు ముఖ్యమైన ఆధారం. మాంసాహారులకి సముద్రంలో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు ముఖ్యం. మాంసంలో కూడా 150/100 మి.గ్రా కాల్షియం వుంటుంది.
ఇక మిటమిన్లు దొరికేవి ఆకుకూరలు, కాయగూరలు, ముఖ్యంగా పాలకూర, గోంగూర, మునగాకు లాంటివి శరీరానికి మంచివి.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో