హైదరాబాద్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: రైల్వే స్టేషన్, బస్టేషన్‌ల వద్ద ప్యాసింజర్ల దృష్టి మళ్లించి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీవిరి నుంచి 40 తులాల బంగారు అభరణాలతో పాటు లక్ష 70వేల రూపాయల నగదును, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో అదనపు డిసిపి పి.యాదగిరి దొంగల ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫేరోజ్‌ఖాన్, మహ్మద్ ఆసీఫ్, మహ్మద్ సలీమ్, మహ్మద్ ఇక్రాముద్దిన్, మహ్మద్ షాహిద్, జూల్ఫాకార్, ఆర్యాన్ చౌదరి అలియాస్ ఫుర్ఖాన్, అస్మాత్‌పేట్‌కు చెందిన మహిళ జకీయాలతో పాటు మరో ఇద్దరు సభ్యులతో కూడిన ముఠా సభ్యులు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలోని సభ్యుల్లో ఇద్దరు సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్యాసింజర్లు తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో వారి స్థితిగతులను పరిశీలించి మిగతా సభ్యులకు సమాచారం అందిస్తారు. ప్యాసింజర్లు ఆటోలో వెళ్తున్నప్పుడు వారితో పాటు దొంగల ముఠా సభ్యులు ఇద్దరు ఆటోలో కూర్చుని, ప్యాసింజర్ల లగేజ్ బ్యాగులను దొంగలించి వాటిలో ఉన్న బంగారు అభరణాలు, నగదును దోచుకెళ్లేవారు. ఈ క్రమంలో కొందరు బాధితులు కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూబ్లీబస్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అనుమానంతో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. హస్మత్‌పేట, జూబ్లీబస్టేషన్‌ల వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితులను పట్టుకున్నారు. పట్టుకున్న నిందితుల్లో మహ్మద్ ఫేరోజ్‌ఖాన్, మహ్మద్ ఇర్షాద్‌ల తో పాటు మరో ఇద్దరు 2013 సంవత్సరంలో చాదర్‌ఘాట్ పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మహ్మద్ ఆసీఫ్ దొంగతనం కేసులో మీర్‌పెట్ పోలీసులు 2014లో దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. పైన పేర్కొన్న నిందితుల్లో ఆసిఫ్ సోదారులైన జూల్ఫ్‌కార్, ఆర్యాన్‌చౌదరి అలియాస్ ఫుర్ఖాన్‌లు ప్రస్తుతం అరెస్ట్ చేసిన కేసుల్లో నిందితులు. బస్టాప్, రైల్వేస్టేషన్‌ల వద్ద ఆటోలో వెళ్తున్న ప్యాసింజర్ల నుండి దొంగలించిన బంగారు ఆభరణాలను హస్మత్‌పేట్‌లో నివాసం ఉండే జకియా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులకు వసతి ఇవ్వటంతో పాటు వారు దొంగలించిన బంగారు అభరణాలను స్థానిక మణపురం గోల్డ్ షాపుల్లో అమ్మి డబ్బులను దొంగలకు అందజేసేది. జకియా అమ్మిన బంగారు ఆభరణాల మీద వచ్చిన డబ్బులో కమీషన్ తీసుకుని మిగతా డబ్బులు అప్పగించేది. మహిళతో పాటు ఎనిమిది అంతరాష్ట్రా ముఠా సభ్యులను కార్ఖానా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి 40 తులాల బంగారు ఆభరణాలు, లక్ష 70వేల రూపాయల నగదుతో పాటు ఎనిమిది సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మహాంకాళి డివిజన్ ఎసిపి వి.తిరుపతి, ఇన్స్‌పెక్టర్లు వై.నాగేశ్వర్‌రావు, ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లలో చోరీకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి వారి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపూర్ జిల్లాకు చెందిన పేరు మోసిన దొంగలు బండ్లీ శ్రీరాములు అలియాస్ బోయాపాటి శ్రీను(37), డెగ్లాఆనంద్(30)లు కలిసి నార్త్‌జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి, బంజారాహిల్స్‌లోని తాళాలు వేసిన ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇళ్ల తాళాలలను పగుల గొట్టి దొంగతనాలు చేసిన కేసుల్లో, ఐదు బోయిన్‌పల్లి, మరొకటి బంజారాహిల్స్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అరెస్టు చేసిన వీరిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

నిరంతర కవి సినారె
కాచిగూడ, డిసెబంర్ 10: ప్రాచీన ఆధునిక సాహిత్యల మేలు కలయికతో అత్యాధునికయుగ కవిగా ఎదిగిన వ్యక్తి డా.సి.నారాయణరెడ్డి అని ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీ కొనియాడారు. వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘సినారె సాహితీ వైభవం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం గురువారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ద్వానాశాస్ర్తీ ఎలాంటి అంశంపైన సాధికారికంగా మాట్లాడగల గొప్పవక్త అని పేర్కొన్నారు. తెలుగు బోధనతో ఎంతో మందిని ఐఏఎస్, ఐపిఎస్‌లను తయారు చేస్తున్న ద్వానాశాస్ర్తీని అభినందించారు. నారాయణరెడ్డిని సంస్థ తరుపున ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రపంచ రికార్డుల గ్రహీత డా. కళావేంకట దీక్షితులు, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.