బిజినెస్

బ్యాంకులు ముందే మేల్కోవాల్సింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ మాల్యా వ్యవహారంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, మార్చి 10: ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను విదేశాలకు పారిపోకుండా నిరోధించేందుకు బ్యాంకులు ముందుగానే చర్యలు చేపట్టి ఉండాల్సిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయినప్పటికీ ఈ కేసులో మాల్యా నుంచి, ఆయనకు చెందిన సంస్థల నుంచి రూ.9000 వేల కోట్లకు పైగా రుణాలను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా తగిన చర్యలు చేపడతామని జైట్లీ గురువారం హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై విజయ్ మాల్యాతో పాటు ఆయనకు చెందిన కొన్ని సంస్థలు న్యాయ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మాల్యాను విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వివిధ బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఈ నెల 2వ తేదీనే ఆయన దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మాల్యాకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ‘లుకౌట్’ నోటీసు జారీ చేసినప్పటికీ దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు ఆయనను ఎలా అనుమతించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే రుణాల వసూలు కోసం బ్యాంకర్లు అన్ని చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు కల్పించామని, ఈ విషయంలో ఎవరైనా అలక్ష్యాన్ని ప్రదర్శించి ఉదాసీనంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వస్తే వారిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని జైట్లీ విలేఖర్లకు తెలిపారు. దేశం వీడి వెళ్లకుండా విజయ్ మాల్యాను ఆపేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ గురించి జైట్లీ మాట్లాడుతూ, ఎవరినైనా విదేశాలకు వెళ్లకుండా నిరోధించడం న్యాయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడం లేదా కోర్టు ఆదేశం లేకుండా ఎవరినీ విదేశాలకు వెళ్లకుండా ఆపలేమని అన్నారు. దేశం విడిచి వెళ్లకుండా మాల్యాను ఆపేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయని, అయితే ఆయన అప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారని జైట్లీ పేర్కొంటూ, ఈ ప్రక్రియను బ్యాంకులు మరింత ముందుగా చేపట్టి ఉంటే బాగుండేదన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఒట్టావియో కత్రోచ్చి గతంలో భారత్‌ను వీడి వెళ్లడానికి, ప్రస్తుతం విజయ్ మాల్యా దేశాన్ని విడిచి వెళ్లడానికి చాలా తేడా ఉందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు.