బిజినెస్

జోరుగా ఆన్‌లైన్ షాపింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: దేశీయంగా వచ్చే పండగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా 25 వేల కోట్ల రూపాయల వాణిజ్య లావాదేవీలు జరుగుతాయని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. ఈ అంశంపై నిర్వహించిన సర్వే వివరాలను అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పండగ పర్వదినాల వల్ల ఈ కామర్స్ జోరందుకుంటుందన్నారు. ఆటోమొబైల్, బయో టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా, ఇంధన రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న 2,500 మందిని సంప్రదించి వారి అభిప్రా యాలతో అధ్యయనాన్ని తయారు చేశారు. అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర పది నగరాల్లో ఈ సర్వే చేశారు. 60 శాతం మంది ఇప్పటికే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాల్సిన జాబితాను తయారు చేసుకున్నట్లు చెప్పారు. గంటలకొద్ది షాపుల వద్ద నిలబడకుండా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరపడం మంచిదనే అభిప్రాయం మెజారిటీ వినియోగదారులు వ్యక్తం చేయడం గమనార్హం.
కాస్మటిక్స్, గృహోపకరణాలు, సుగంధ పరిమళాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర చిన్న పరికరాల కోసం ఆన్‌లైన్ షాపింగ్ ఉత్తమమని సర్వే జనులు అభిప్రాయపడ్డారు. కాగా, నిరుడు ఇదే రోజుల్లో 20 వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ వ్యాపారం జరిగింది. దీంతో ఈసారి మరో 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చని తాజా సర్వే ఆధారంగా అసోచామ్ చెబుతోంది. ఫ్రీ షిప్పింగ్, వస్తువులు బాగాలేకపోతే ఇంటికి వచ్చి తీసుకుని మళ్లీ మార్చడం, వేగంగా వస్తువులు గమ్యానికి చేరవేయడం ఆన్‌లైన్ షాపింగ్‌లో సాధ్యమని చాలా మంది అన్నట్లు రావత్ తెలిపారు. వెబ్‌సైట్లో ఆన్‌లైన్ షాపింగ్ వివరాలను చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.