రాష్ట్రీయం

అమెరికా తీరు ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులను వెనక్కి
పంపటంపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్య
త్వరలో కొత్త ఏవియేషన్ విధానం

హైదరాబాద్, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లిన విద్యార్థులను ఆ దేశం తిరిగి పంపించడం ఆందోళనకరమైన అంశమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. మన విద్యార్థులు అమెరికాలో పేరున్న విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని, ప్రస్తుతం సమస్యంతా అంతగా పేరులేని విశ్వవిద్యాలయాలతోనేనని ఆయన అన్నారు. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు వెళ్లిన విద్యార్థులను వెనక్కు పంపించిన విషయం సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ విద్యార్థులంతా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వారు కావడం గమనార్హం. దేశంలో విమానయాన రంగానికి దశ, దిశ మార్గనిర్దేశనం చేసేందుకు త్వరలో కొత్త ఏవియేషన్ విధానాన్ని ఖరారు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోకగజపతి రాజు తెలిపారు.
కొత్త పాలసీని రూపొందించామని, దీనిని కేంద్ర మంత్రి వర్గం ఆమోదానికి పంపించామన్నారు. ఇంతవరకు ఈ విధానంపై మూడు లక్షల మంది సూచనలు చేశారన్నారు. సోమవారం ఇక్కడ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికులకు నెలకొల్పిన ఇ- బోర్డింగ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త విమానయాన విధానంపై చాలా చర్చ జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల పాటు దేశీయంగా విమానాలను తిప్పిన సంస్థలకే అంతర్జాతీయ విమానసర్వీసులను నడిపేందుకు అనుమతించాలన్న నిబంధనను కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తోందన్నారు. ఇ బోర్డింగ్ విధానం వల్ల ఆధార్ కార్డు నంబర్‌తో ఉన్న వారు నేరుగా టర్మినల్ బిల్డింగ్‌లోకి వెళ్లవచ్చును. అదే ఆధార్ కార్డు నంబర్ లేకుండా ఉన్న వారు పాత పద్ధతిలోనే ఫొటో ఐడి కార్డును చూపించి విమానాశ్రయ ప్రాంగణంలోకి వెళ్లాల్సి ఉంటుంది. దేశంలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అన్ని వౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయన్నారు. మన దేశ అవసరాలకు తూర్పు, పశ్చిమ తీరంలో రెండు చొప్పున అంతర్జాతీయ విమానాశ్రయాలు నెలకొల్పాల్సి ఉందన్నారు.
** శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఇ-బోర్డింగ్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు **