ఆంధ్రప్రదేశ్‌

అశోక్‌బాబుపై తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 7: ఎపి ఎన్‌జివో సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ అశోక్‌బాబుపై తిరుగుబాటు ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను దాదాపు 90 రోజులపాటు సమ్మెబాట పట్టించడమే గాక ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అశోక్‌బాబు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఎంతో దగ్గరయ్యారు. అనుకోని రీతిలో సమ్మె కాలానికి జీతాలు చెల్లింపు, కొత్త పిఆర్‌సి, పదవీ విరమణ వయస్సు పెంపు వంటివి చోటుచేసుకోవటంతో అశోక్‌బాబు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో తోటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే భావనతో క్రమేణా ఉద్యోగుల్లో ఆయనపట్ల వ్యతిరేకత ప్రబలుతూ వచ్చింది. ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపుతో ఆయన మరోసారి ఎన్‌జీవో సంఘం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో విజయవాడలో జరిగే ఎన్‌జివో సంఘం మహాసభలో అశోక్‌బాబు రెండోసారి అధ్యక్షునిగా ఎన్నిక కాబోతున్నారు. సాంప్రదాయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్‌జివో సంఘం అధ్యక్షులే ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జెఎసి చైర్మన్ పదవి నుంచి ఆయనను పక్కకు నెట్టివేసే ప్రయత్నాలు కొద్దిరోజులుగా తెరవెనుక ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు దాదాపు 90కి పైగానే ఉండగా ఉద్యోగులకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటైన జాయింట్ స్ట్ఫా కౌన్సిల్‌లో తొమ్మిది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో ఎన్‌జివో సంఘం, రెవెన్యూ సంఘం, క్లాస్-4, డ్రైవర్స్, నాలుగు ఉపాధ్యాయ సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నాయి. తాజాగా రెవెన్యూ, క్లాస్-4, డ్రైవర్స్ సంఘాలు అశోక్‌బాబు నాయకత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయని చెప్పటానికి ఆయన అధ్యక్షతన ఎన్‌జివో సంఘంలో శనివారం జరిగిన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ప్రబల నిదర్శనంగా పేర్కొనవచ్చు. అశోక్‌బాబును వ్యతిరేకిస్తున్న పై మూడు సంఘాల ప్రతినిధులతోపాటు కోఆపరేటివ్, ట్రెజరీ, గెజిటెడ్ ఆఫీసర్స్, మున్సిపల్ ఎంప్లారుూస్, మహిళా, శిశు సంక్షేమ సంఘం, వివిధ ఇంజనీరింగ్ శాఖల విభాగాల్లో పనచేసే వర్క్‌చార్జ్‌డ్ అసోసియేషన్, మెడికల్ హెల్త్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్స్, విఆర్‌వో అసోసియేషన్, విఆర్‌ఎ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు ఓ పక్క వ్యూహరచనతో నేటి సమావేశాన్ని బహిష్కరించడంతో జెఎసిలో చీలిక అనివార్యంగా కన్పిస్తోంది. అయితే అశోక్‌బాబుకు మొదటినుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన పశ్చిమ కృష్ణా సంఘ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ స్వయంగా గత మూడురోజులుగా రెవెన్యూ, ఇతర సంఘాల నేతలతో నడిపిన రాయబారాలు ఫలించలేదు. అయితే అశోక్‌బాబు సమస్యల పరిష్కారంలో సిఎం వద్ద రాజీపడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. ఎన్‌జివో సంఘం కేవలం నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంటే ఒక్క రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాత్రమే అటెండర్ నుంచి గెజిటెడ్ హోదా కల్గిన తహశీల్దార్ కేడర్ వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. పబ్బరాజు నాయకత్వంలో రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు సిఎంతో పోరాడి ఎంతోకాలంగా పెండింగ్‌లోనున్న వందలాది పోస్టుల భర్తీకి, అలాగే ప్రతి తహశీల్దార్‌కు కొత్త వాహనాన్ని మంజూరు చేయించిన విషయాన్ని ఇతర సంఘాల నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అయినా జెఎసి చైర్మన్ పట్టించుకోవటం లేదని అంటున్నారు.
ఇదిలా వుండగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్యపై జనవరి నెలాఖరులో రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించాలని, అవసరమైతే జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహించాలని మార్చి 2తేదీ పార్లమెంట్ ఎదుట జరిగే భారీ ప్రదర్శనలో పాల్గొనాలని నాటి జెఎసి సమావేశంలో నిర్ణయించినట్లు జెఎసి చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో తొలుత అశోక్‌బాబు మాట్లాడుతూ గత సెప్టెంబర్ 20న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రితో జరిపిన చర్చల్లో లభించిన హామీల అమలు కోసం తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. అసలు మంత్రి హామీ వలన సెప్టెంబర్ 27న తలపెట్టిన రాష్టవ్య్రాప్త ఆందోళనను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదంటూ అశోక్‌బాబు ఆగ్రహించారు.