జాతీయ వార్తలు

50 నదుల్లో సింఘాల్ చితాభస్మం నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 22: ఇరవై సంవత్సరాల పాటు తమ సంస్థ అధ్యక్షుడిగా సేవలందించి ఇటీవల కన్నుమూసిన అశోక్ సింఘాల్ అస్థికలను దేశవ్యాప్తంగా ఉన్న 50కి పైగా పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ సోమవారం నుంచి 15 రోజలపాటు అస్థి కలశ యాత్రలను నిర్వహిస్తుందని విహెచ్‌పి ఉత్తరప్రదేశ్ విభాగం ప్రతినిధి శారద్ శర్మ చెప్పారు. ఈ యాత్ర ప్రయాగనుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 27న లక్నోనుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర అయోధ్యలో ముగుస్తుందని, అక్కడ అస్థికలను సరయూ నదిలో నిమజ్జనం చేస్తారని ఆయన చెప్పారు. బారాబంకి, ఫైజాబాద్‌లాంటిచోట్ల సింఘాల్ చితాభస్మం ఉన్న కలశాలను ప్రజల సందర్శనార్థం ఉంచుతారని కూడా ఆయన చెప్పారు. చితాభస్మాన్ని వేర్వేరు రోజుల్లో మథుర, వారణాసి, చత్రకూట్, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. సింఘాల్‌కు సంబంధించినంతవరకు అయోధ్య ఆయన కర్మభూమి అని, అయోధ్యలో మందిర నిర్మాణం జరిగేలా చూడాలన్నది సింఘాల్ దృఢసంకల్పం అనే విషయాన్ని జనానికి గుర్తుచేయడం ఈ యాత్రల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని శర్మ చెప్పారు. 89 ఏళ్ల సింఘాల్ ఈ నెల 17న గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్వాస సంబంధ సమస్యల కారణంగా మృతిచెందిన విషయం తెలిసిందే.