రాష్ట్రీయం

చిట్టా విప్పిన ఎఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఫైనాన్స్’కు సహకరించిన డాక్టర్, లాయర్, మరో ముగ్గురు పోలీసులు
అప్పులు తీసుకున్న జాబితాలో రియల్టర్లు, రాజకీయ నాయకులు
అకౌంటెంట్, మరో బినామీ అరెస్ట్ బ్యాంకు ఖాతాల స్తంభన

కరీంనగర్, నవంబర్ 26: ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి చిత్రగుప్తుడు చిట్టా విప్పాడు. మోహన్‌రెడ్డికి నమ్మినబంటు, ఫైనాన్స్ అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ (59)తో సహా మరో బినామీ సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి (39)లను గురువారం సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి డిసెంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి అజార్ హుస్సేన్ ఉత్తర్వులు జారీచేశారు. సిఐడి విచారణలో జ్ఞానేశ్వర్ ఎఎస్‌ఐ ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టిన, సహకరించిన, అప్పులు తీసుకున్న వారి పేర్లను వెల్లడించాడు. ఇందులో ముగ్గురు పోలీసు అధికారులు, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక సబ్ రిజిష్ట్రార్ ఉండడం విశేషం. ఇప్పటికే ఆరుగురు పోలీసు అధికారులు పెట్టుబడులు పెట్టగా, తాజాగా గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.బి.పి.నాయుడు (20లక్షలు) పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులు సహకరించగా, తాజాగా డిఎస్పీ హబీబ్‌ఖాన్, చొప్పదండి సిఐ లక్ష్మిబాబు దందాకు సహకరించినట్లు వెల్లడించాడు. నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ వి.సూర్యనారాయణరెడ్డి (రూ.90లక్షలు), సబ్ రిజిష్ట్రార్ మల్లిఖార్జున్ (రూ.20లక్షలు), లాయర్ బద్దం రాంరెడ్డి (రూ.10లక్షలు), పద్మ (50లక్షలు), సుజాత (20లక్షలు) పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించాడు. మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌లో అప్పులు తీసుకున్న వారిలో రియల్టర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి (రూ.10.30లక్షలు), టిఆర్‌ఎస్ నేత దాది సుధాకర్ (రూ.74.60లక్షలు), టిఆర్‌ఎస్ మహిళా నేత కాలిదాసు రేణుక (రూ.47.65లక్షలు), రియల్టర్ కొండాల్‌రెడ్డి (రూ.80లక్షలు), వెంకటేశ్వర లాడ్జి యజమాని సోమ సురేష్ (రూ.70లక్షలు)తోపాటు పలువురు అప్పులు తీసుకున్నట్లుగా జ్ఞానేశ్వర్ వెల్లడించాడు.
ఇప్పటికే ఈ దందాతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది పోలీసు అధికారులపై వేటు పడగా, తాజాగా మరో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు వెలుగుచూడడంపై పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోహన్‌రెడ్డి కేసులో ఇప్పటివరకు మోహన్‌రెడ్డితో సహా 11మందిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మోహన్‌రెడ్డి, ఆయన అనుచురులు, బినామీలపై ఉన్న ఆస్తులు ఇతరులకు మార్పులు చేర్పులు చేయవద్దని కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లేఖలు రాసిన సిఐడి అధికారులు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేయాలని బ్యాంకులకు సైతం లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు కెన్‌క్రెస్ట్ ప్రసాదరావు ఆత్మహత్యకు ఎఎస్‌ఐ బెదిరింపులే కారణమని కేసు నమోదు కాగా, మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే ఆయనకు సంబంధించిన రెండు సెల్‌పోన్లు, ప్రసాదరావు కుమారుడు అత్రేష్ సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మూడు సెల్‌ఫోన్లలో రికార్డు అయిన స్వర నిర్ధారణ కోసం సిఐడి అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇలా అన్ని కోణాల్లో సిఐడి ముందుకెళ్తుంటే, అటు ఆదాయశాఖ, ఈడి అధికారులు సైతం మోహన్‌రెడ్డి దందాపై దృష్టి సారించారు. ఇప్పటికే అన్ని వివరాలు సేకరించిన ఈ శాఖలు నేడోరేపో వారికి నోటిసులు కూడా జారీచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, ఎఎస్‌ఐ, జ్ఞానేశ్వర్ కుమారులు కీలక పత్రాలను పట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఎఎస్‌ఐ కేసు ఓ కొలిక్కి వస్తుండగా, బినామీలు, అనుచరులు, సహకరించిన పోలీసుల ఆస్తిపాస్తులపై ఆదాయ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌లు దృష్టి సారించడంతో ఈ కేసు ఇంకేన్ని మలుపులు తిరగుతుందో, ఇంకెంతమంది పేర్లు వెలుగుచూస్తాయోననే అంశం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.