జాతీయ వార్తలు

అసోం, బీహార్‌లలో వర్షబీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారీ వర్షాలు అసోం, బీహార్ రాష్ట్రాలను ముంచెత్తాయి. అసోంలో గుహవాటి సహా 33 జిల్లాలు వరద నీటిలో మునిగాయి. బహ్మ్రపుత్ర, దాని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.అసోంలో దాదాపు 49 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 4,620 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ 562 సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కేంద్రం రూ.261 కోట్లు విడుదల చేసింది. పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్‌, పుతీమరి, బేకి, బరాక్‌, బాదర్‌పూర్‌ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం అసోం ప్రభుత్వం 226 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. లక్షా రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎగువ కురుస్తున్న వర్షాలతో బీహార్‌లోని నదులు పొంగిపొర్లుతున్నాయి. 199 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. లక్షా 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 33 మంది మృతి చెందారు. ఒక్క సీతామర్హ జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడడం గమనార్హం. వరదల కారణంగా 12 జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు.