జాతీయ వార్తలు

అసోంలో బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ అసోంలో వామపక్షాలు 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 10న జరిగే బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరాయి. భారత పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నార్త్‌ ఈస్ట్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌ఈఎస్‌వో) కూడా నార్త్‌ ఈస్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి బంద్‌ చేపట్టాలని ఎన్‌ఈఎస్‌వో విజ్ఞప్తి చేసింది. ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఏఐయూడీఎఫ్‌) జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టింది. భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏఐయూడీఎఫ్‌ ఎంపీ బద్రూద్దీన్‌ అజ్మల్‌ తేల్చిచెప్పారు.