ఆటాపోటీ

ఎన్నికకు సీలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐ పాలక మండలికి ఎవరైనా వరుసగా రెండుసార్లు, గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చు. అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే అధిక కాలం పదవిలో ఉండకూడదని నిబంధనలను మార్చాలని లోధా కమిటీ సూచించింది. ఒకసారి ఎన్నికైన పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చని పేర్కొంది. అయితే, అధ్యక్షుడు అత్యధికంగా రెండుసార్లు, మిగతా కార్యవర్గ సభ్యులు వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే ఎక్కువ సమయం పదవిలో కొనసాగేందుకు వీలులేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బిసిసిఐ ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తన పదవీకాలం పూర్తయిన వెంటనే మళ్లీ పోటీ చేయడానికి వీలుండదు. అతను ఇటీవలే వరుసగా రెండోసారి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. కాబట్టి మూడేళ్ల విరామం తర్వాత, చివరిగా మూడోసారి అతను బోర్డు పాలక మండలిలో సభ్యుడిగా సేవలు అందించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ గతంలోనూ ఒకసారి అదే హోదాలో సేవలు అందించాడు. ఈటెర్మ్ పూర్తయితే, మొత్తం మీద ఆరు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన కారణంగా అతను మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేసే వీలుండదు.