ఆటాపోటీ

పిస్టోరియస్ కెరీర్‌కు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ కెరీర్‌కు తెరపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అతనిని హంతకుడిగా దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు నిర్ధారించడంతో, భవిష్యత్తులో రేసుల్లో పాల్గొనే అవకాశం అతనికి ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పిస్టోరియస్‌ను దోషిగానే పేర్కొన్న సుప్రీం కోర్టు శిక్షను మాత్రం ఖరారు చేయలేదు. అతనికి విధించాల్సిన శిక్షను ఖారారు చేయాలని సూచిస్తూ కేసును ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ట్రయల్ కోర్టు అతనికి తాత్కాలికంగా షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, 2013 ఫిబ్రవరి 14వ తేదీన తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను పిస్టోరియస్ హత్య చేశాడు. అయితే, ఆగంతకులు ఎవరో ఇంట్లోకి చొరబడ్డారని అనుమానించి తాను కాల్పులు జరిపానని, అక్కడ తన గర్ల్‌ఫ్రెండ్ రీవా ఉందనే విషయం తెలియదని అతను కోర్టులో వాదించాడు.
తాను తొందరపడ్డానే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నాడు. అతని వాదనతో ట్రయల్ కోర్టు ఏకీభవించింది. బాత్రూమ్‌లో అలికిడి వినిపించడంతో బయట నుంచే కాల్పులు జరిపిన పిస్టోరియస్‌కు రీవాను హత్య చేయాలన్న ఆలోచన లేదని అభిప్రాయపడింది. అనుమతి లేకుండా ఆయుధాన్ని కలిగి ఉండడం, దానిని ఉపయోగించడాన్ని నేరాలుగా పరిగణిస్తూ ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఏడాది జైలును పూర్తి చేసుకున్న పిస్టోరియస్ ఇటీవలే పెరోల్‌పై విడుదలయ్యాడు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగడం, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కోర్టు అతనిని దోషిగా పేర్కోవడం జరిగిపోయాయి. దీనితో నిర్దోషిగా బయటపడతానన్న పిస్టోరియస్‌కు ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ప్రాసిక్యూషన్ అభియోగాలకు పిస్టోరియస్ ఇచ్చిన వివరణ, చేసిన వాదన తప్పులతడకగా ఉందని న్యాయమూర్తి లీచ్ అభిప్రాయపడడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది.
పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పాడని న్యాయమూర్తి స్పష్టం చేశాడు. బయట నుంచి తుపాకీతో కాల్పులు జరిపితే, లోపల ఉన్న వ్యక్తి మృతి చెందే అవకాశం ఉంటుందన్న విషయం అతనికి తెలియంది కాదని వ్యాఖ్యానించాడు. ఈ వాస్తవం తెలిసే అతను కాల్పులు జరిపాడని వివరించాడు. ఈ కోణంలో చూస్తే అతను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే అత్యాధునిక తుపాకీతో కాల్పులు జరిపాడని తేల్చిచెప్పాడు. న్యాయమూర్తి వివరణ ట్రయల్ కోర్టులో పిస్టోరియస్‌కు విధించబోయే శిక్షపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అతనికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిస్టోరియస్ మళ్లీ ప్రాక్టీస్ చేయడం, ట్రాక్‌పైకి రావడం, పోటీల్లో పాల్గొనడం సాధ్యం కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.