ఆటాపోటీ

మేవెదర్, పాక్వియానో రీ మ్యాచ్ జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటమి ఎరుగని వీరుడు ఫ్లోయిడ్ మేవెదర్‌తో రీ మ్యాచ్‌కి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించిన ఫిలిప్పీన్స్ బాక్సింగ్ హీరో మానీ పాక్వియావో దానిని ఒక జోక్‌గా కొట్టిపారేశాడు. అంతలోనే మళ్లీ మాట మార్చేసి, ఏ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించి, అభిమానులను అయోమయానికి గురి చేశాడు. బాక్సింగ్ కెరీర్ గురించి ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేయడం పాక్వియావోకు అలవాటుగా మారింది. ఇటీవల జెస్సీ వర్గాస్‌తో పోరుకు ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఏడాది గురించి తాను ఎలాంటి నిర్ణయాలకు రాలేనని స్పష్టం చేయడంతో, మేవెదర్‌తో అతని ఫైట్ ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, వర్గాస్‌ను ఓడించి, డబ్ల్యుబివో టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను వచ్చే ఏడాది మేవెదర్‌తో ఫైట్ ఉండదని చెప్పడానికి వీల్లేదంటూ మాట మార్చాడు. నిజానికి, నిరుడు మే మాసంలో జరిగిన ఫైట్‌లో మేవెదర్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాక్వియావో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత ఫిలిప్పీన్స్ పార్లమెంటుకు పోటీ చేసి గెలిచాడు. అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకొని, వర్గాస్‌తో పోరుకు సై అన్నాడు. ఆ ఫైట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెల్చుకోవడంతో, కెరీర్‌ను మరికొంత కాలం కొనసాగించాలని అనుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చేసిన అతని వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. మేవేదర్‌తో రీ మ్యాచ్‌కి సిద్ధమని పాక్వియావో ఆ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. దీనితో మరోసారి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అతనితో ఫైట్‌కు మేవెదర్ అంగీకరిస్తాడా? అన్న ప్రశ్న అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ, మేవెదర్‌తో ఫైట్ గురించి అడుగుతున్న ప్రశ్నలను అతను తేలిగ్గా తీసుకున్నాడు. మేవెదర్‌తో గతంలో తాను చేసిన ఫైట్‌కు సంబంధించి జెర్సీపై ఉన్న ఫొటోను చూపుతూ, ‘మీరు కోరుతున్న ఫైట్ ఇదిగో.. చూడండి’ అని ట్వీట్ చేశాడు. ఈ తాజా ప్రకటన తర్వాత అతని ఆంతర్యం ఏమిటో అర్థంగాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద, వీరిద్దరి మధ్య ఫైట్ ఎప్పుడు ఉంటుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిరుడు మేలో పాక్వియావో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అంతకు ముందు కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం, తిమోతీ బ్రాడ్లీతో మేవెదర్ చివరి ఫైట్ చేశాడు. అందులోనూ విజయభేరి మోగించాడు. కెరీర్‌లో అతను మొత్తం 49 ఫైట్స్‌లో పాల్గొని, అన్నింటిలోనూ గెలుపొంది, ఓటమి ఎరుగని వీరుడిగా తనకు ఉన్న రికార్డుతోనే కెరీర్‌ను ముగించాడు. పాక్వియావో తన నిర్ణయాన్ని మార్చుకోగా, మేవెదర్ ఇంకా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. అందుకే, వీరి మధ్య పోరు ఉంటుందా లేదా అన్నది ఆసక్తి కలిగిస్తున్నది. వాస్తవానికి, వీరి చివరి పోరు హోరాహోరాగా జరుగుతుందని ఆశించిన అభిమానులకు అది ఏకపక్షంగా ముగియడంతో యావత్ ప్రపంచం నిరాశ చెందింది. మేవెదర్ ముందు నిలవలేకపోయిన పాక్వియావో కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక చిత్తయ్యాడు. ఒకరు రెచ్చిపోతే, మరొకరు చేతులెత్తేయడం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. ఇది నిజమైన ఫైట్ కాదని, ఫిక్సింగ్ జరిగిందని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎలాంటి ఆసక్తిని రేకెత్తించని ఫైట్ కోసం తాము ఎందుకు నష్టపోవాలని నిలదీస్తూ, టికెట్ల కోసం తాము వెచ్చించిన మొత్తాన్ని వాపసు ఇవ్వాలని ప్రేక్షకులు ఆందోళన కూడా చేశారు. అప్పటి నుంచి పాక్వియావో ఎక్కడికి వెళ్లినా అటు మీడియా, ఇటు అభిమానులు ఇదే ప్రశ్న వేయడం పరిపాటిగా మారింది. నిరుడు మేవెదర్‌తో జరిగిన ఫైట్‌ను ప్రస్తావిస్తూ, ఎందుకు ఏకపక్షంగా ముగిసిందన్న ప్రశ్నలు పాక్వియావోను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్గాస్‌తో జరిగిన ఫైట్‌కు ముందు, ఆ తర్వాత కూడా అతనికి ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాగా, తాజాగా చేసిన ట్వీట్‌లో ఫొటోను చూపుతూ అతను చేసిన కామెంట్ అనుమానాలకు తావిస్తున్నది. అయితే, ఆ వెంటనే అతను మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. మేవెదర్‌తో రీ-బౌట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ రీ మ్యాచ్ గురించి అడుగుతున్నారని, ప్రశ్నించడం సులువని, కానీ సమాధానం ఇవ్వడం అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. వర్గాస్‌తో జరిగిన ఫైట్‌కు మేవెదర్‌ను ఆహ్వానించానని, అతను కూడా సానుకూలంగా స్పందించి థామస్ అండ్ మాక్ సెంటర్‌కు వచ్చాడని చెప్పాడు. అయితే, రీ మ్యాచ్‌ని కోరితే అతను అంగీకరిస్తాడో లేదో తాను చెప్పలేనని అన్నాడు. తనవైపు నుంచి మాత్రం మేవెదర్‌తో ఫైట్‌కు తప్పనిసరిగా అంగీకారం ఉంటుందని తెలిపాడు. మేవెదర్‌తో రీ మ్యాచ్‌పై పాక్వియావో వేరువేరుగా వ్యాఖ్యలు చేయడంతో అతని ఆలోచన ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.