ఆటాపోటీ

ఆసియాలోనే ప్రతాపం! ( పాప్‌కార్న్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంట్లో పులి.. వాకిట్లో పిల్లి అన్న ముద్ర భారత క్రికెట్ జట్టుపై ఎన్నో దశాబ్దాలుగా ఉంది. చాలా మంది క్రికెటర్లకూ ఇలాంటి పేరే ఉంది. ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగి, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వనే్డలో సెంచరీ సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించాలి. అతని ప్రతాపం కేవలం ఆసియాలోనే. మరే ఇతర ఖండంలోనూ అతను ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే వాస్తవం. కెరీర్‌లో అతను ఆరు టెస్టు, పది వనే్డ సెంచరీలు చేశాడు. ఇవన్నీ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో చేసినవే కావడం విశేషం. ఆసియా ఖండం వెలుపల అతను ఎన్నడూ సెంచరీ చేయలేదు.

ఇంజీ రికార్డు

* సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారాతో పోల్చతగ్గ ప్రతిభావంతుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. అతని ఖాతాలో ఎన్నో రికార్డులున్నాయి. వాటిలో అత్యంత అరుదైన రికార్డును అతను 1991 నవంబర్ 24న వెస్టిండీస్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన వనే్డలో నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లోనే అతను తన కెరీర్‌లో మొట్టమొదటిసారి బౌలింగ్ చేశాడు. వేసిన తొలి బంతికే వికెట్ సాధించాడు. ఇంజీ వేసిన బంతిని లారా బ్యాట్‌ను తగులుతూ వికెట్‌కీపర్ మోయిన్ ఖాన్ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. వనే్డల్లో వేసిన మొదటి ఓవర్, మొదటి బంతిలోనే వికెట్ సాధించిన ఆటగాడు ఇప్పటి వరకూ అతనొక్కడే.

రోహిత్ ‘డబుల్’

* వనే్డ ఇంటర్నేషనల్స్ చరిత్రలో ఆరు పర్యాయాలు మాత్రమే డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండు పర్యాయాలు డబుల్ సెంచరీ సాధించి, అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డలో అతను 209 పరుగులు చేశాడు. 2014 నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వనే్డలో 264 పరుగులు చేశాడు. వనే్డల్లో ఇప్పటి వరకూ అదే అత్యధిక స్కోరు. కాగా, సచిన్ (గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 200 నాటౌట్), వీరేందర్ సెవాగ్ (వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 219), క్రిస్ గేల్ (జింబాబ్వేపై కాన్‌బెరాలో 215), మార్టిన్ గుప్టిల్ (వెస్టిండీస్‌పై వెల్లింగ్టన్‌లో 237 నాటౌట్) కూడా వనే్డల్లో డబుల్ సెంచరీలు చేశారు.

- సత్య