ఆటాపోటీ

టీమిండియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో, అత్యధిక స్కోర్ల విషయంలో ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయి. 2004 జనవరిలో జరిగిన సిడ్నీ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లకు 705 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అయితే, రెండు, మూడు స్థానాలు ఆసీస్ దక్కించుకుంది. 1948 జనవరిలో జరిగిన అడెలైడ్ టెస్టులో ఆసీస్ 674 పరుగులు సాధించింది. 2012 జనవరిలో ఆసీస్ సిడ్నీ టెస్టులో నాలుగు వికెట్లకు 659 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 600 లేదా అంతకు మించి స్కోర్లు నమోదైన సంఘ్టనలు మఠో ఐదున్నాయి. 2001 మార్చిలో (కోల్‌కతా) భారత్ 7 వికెట్లకు 657 పరుగులు సాధించింది. 1998 మార్చిలో (కోల్‌కతా) ఐదు వికెట్లకు 633 పరుగులు చేసింది. 2008 అక్టోబర్‌లో (్ఢల్లీ) 7 వికెట్లు కోల్పోయి 613 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా 2012 జనవరిలో (అడెలైడ్) 7 వికెట్లకు 604, 1986 జనవరిలో (సిడ్నీ) 4 వికెట్లకు 600 చొప్పున పరుగులు చేసింది.

తాజా జరగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ నెల 23 నుంచి 27 వరకు మొదటి టెస్టు పుణేలో ఆడతాయి. రెండో టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో జరుగుతుంది. మూడో టెస్టు మార్చి 16 నుంచి 20 వరకు రాంచీలో, చివరిదైన నాలుగో టెస్టు మార్చి 25 నుంచి 29 వరకు ధర్మశాలలో ఉంటాయి.