ఆటాపోటీ

టాస్‌కు ఎప్పుడూ లేటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మిగతా విషయాల్లో ఎలావున్నా, టాస్‌కు వెళ్లేందుకు మాత్రం బద్దకించేవాడు. ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు టాస్ కోసం వెళ్లి మైదానంలో చాలాసేపు వేచిచూస్తున్నా అతని జాడ ఉండేది కాదు. 2001లో భారత సిరీస్‌కు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా గంగూలీ తన వైఖరిని స్టీవెన్ వాకు రుచిచూపాడు. తర్వాతి కాలంలో వా ‘అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్’ అనే పేరుతో ఆత్మకథను రాసినప్పుడు గంగూలీ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘కోల్‌కతా ప్రిన్స్’ ఎప్పుడూ టాస్‌కు ఆలస్యంగా వచ్చేవాడని వాపోయాడు. 2001 సిరీస్‌లో ఏడుసార్లు అతని కోసం తాను మైదానంలో వేచిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఇంతకీ టాస్‌కు వెళ్లడానికి గంగూలీ ఎందుకు ఆలస్యం చేసేవాడో ఎవరికీ తెలియదు. అది బద్దకమైనా కావచ్చు లేక మిగతా వారికంటే తాను ఉన్నతుడిననే అహంభావమైనా కావచ్చు!