ఆటాపోటీ

ఒకే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐపిఎల్ వేలంలో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు 52 మంది ఉన్నారు. వీరిలో 51 మంది భారత క్రికెటర్లే. విదేశీ క్రికెటర్ ఒకే ఒక్కడున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ హాండ్స్‌కోమ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన ఆడం జంపా కూడా అతని సరసన స్థానం సంపాదించేవాడే. అయితే, వెలం జరగడానికి ముందు రోజే అతను వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆడడం ద్వారా అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. దీనితో హాండ్స్‌కోమ్ ఒక్కడే విదేశీ అన్‌క్యాప్డ్ క్రికెటర్‌గా మిగిలాడు.

పొదుపరి నైట్‌రైడర్స్

* కోల్‌కతా నైట్‌రైడర్స్ మిగతా ఫ్రాంచైజీల కంటే అతి తక్కువ మొత్తాన్ని వేలంలో ఖర్చు చేసింది. మిగతా ఫ్రాంచైజీలు 10 కోట్లకంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తే, నైట్‌రైడర్స్ 5.7 కోట్లు ఖర్చు చేసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 31 కోట్లు, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ 21.8 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 21.75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.

దశ తిరిగింది

* నాథూ సింగ్ దశ తిరిగింది. జైపూర్‌లో వైర్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడి కుమారుడికి ఐపిఎల్ వేలంలో భారీ మొత్తం పలుకుతుందని ఎవరూ ఊహించలేదు. ముంబయి ఇండియన్స్ 3.2 కోట్ల రూపాయలకు పాడుకోవడంతో ఇది నిజమా లేక కలా అన్న అనుమానం నాథూని వీడడం లేదు. వేలంలో అతని బేస్‌ప్రైస్ కేవలం 10 లక్షలు. అంత కంటే 32 రెట్లు ఎక్కువ మొత్తం అతనికి లభించింది. ఈ సీజన్‌లోనే రాజస్థాన్ తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టిన అతను ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులిచ్చి ఏడు వికెట్లు కూల్చి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో గ్లేన్ మెక్‌గ్రాత్ వంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ పర్యవేక్షణలో బౌలింగ్‌కు పదును పెట్టుకున్న నాథూ సింగ్ చాలా తక్కువ సమయంలోనే సెలక్టర్లను ఆకట్టుకున్నాడువ. దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆడాడు. దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’కి ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌లో ఇప్పటి వరక ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 14 వికెట్లు పడగొట్టాడు. గంటకు సుమారు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల నాథూ సింగ్‌కు టీమిండియాలో స్థానం దక్కే అవకాశాలున్నాయి.

- సత్య