ఆటాపోటీ

వనే్డల్లో 54.. టెస్టుల్లో 42 పరుగులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జట్టుకు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యల్ప స్కోరు 54 పరుగులు. 2000 అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగిన షార్జా కప్ ఫైనల్‌లో టీమిండియా కుప్పకూలిన వైనమిది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు సాధించింది. సనత్ జయసూర్య 161 బంతుల్లో, 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 189 పరుగులు సాధించాడు. రసెల్ ఆర్నాల్డ్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 54 పరుగులకే కుప్పకూలింది. రాబిన్ సింగ్ (11) తప్ప ఎవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. సౌరవ్ గంగూలీ 3, సచిన్ తెండూల్కర్ 5, యువరాజ్ సింగ్ 3, వినోద్ కాంబ్లీ 3, హేమాంగ్ బదానీ 9, విజయ్ దహియా 4, సునీల్ జోషి 4, అజిత్ అగార్కర్ 2, జహీర్ ఖాన్ 1, వెంకటేశ్ ప్రసాద్ (1 నాటౌట్) పరుగులకు పరిమితమయ్యారు. రాబిన్ సింగ్, బదానీ తర్వాత ఎక్కువ పరుగులు ఎక్‌స్ట్రాలు (6) రూపంలో లభించినవే కావడం గమనార్హం.
వనే్డనే బెటర్!
భారత క్రికెట్ జట్టు అత్యల్ప స్కోర్లను పరిశీలిస్తే, టెస్టు కంటే వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లోనే మెరుగ్గా ఉంది. వనే్డల్లో భారత్ అత్యల్ప స్కోరు 54 పరుగులైతే, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో కేవలం 42. 1974 జూన్‌లో, ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 629 పరుగులకు సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడుతూ 42 పరుగులకే ఆలౌటైంది. ఏక్‌నాథ్ సోల్కర్ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే వెనుదిరిగారు. అప్పటి కెప్టెన్ అజిత్ వాడేకర్ (3)తో విభేదించిన కారణంగానే సునీల్ గవాస్కర్ (5), ఫరూఖ్ ఇంజనీర్ (0), గుండప్ప విశ్వనాథ్ (5) బ్రిజేష్ పటేల్ (1), అబిద్ అలీ (3), మదన్ లాల్ (2), ఇర్రాపల్లి ప్రసన్న (5) ఉద్దేశపూర్వకంగా వికెట్లు సమర్పించుకున్నారన్న విమర్శలున్నాయి. భగవత్ చంద్రశేఖర్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. మొత్తం మీద భారత్ వైఫల్యం ఇంగ్లాండ్‌కు ఇన్నింగ్స్ 285 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని అందించింది.