ఆటాపోటీ

గాయాల టోర్నీ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్‌ను చాలామంది గాయాల టోర్నీగా పేర్కొంటారు. ఇందులో పాల్గొనే ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోవడం మామూలే. ప్రతి మ్యాచ్‌లోనూ గొప్పగా ఆడడం ద్వారా వచ్చే ఐపిఎల్‌లో డిమాండ్ తగ్గకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే గాయపడుతుంటారు. ఎంతో మంది ఆటగాళ్లు గాయాలను బయటపెట్టకుండా డబ్బు కోసం టోర్నీలో ఆడిన సంఘటనలు లేకపోలేదు. తాజా ఐపిఎల్ ప్రారంభానికి ముందే రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు గాయాలతో వైదొలిగారు. టోర్నీ మొదలైన తర్వాత తీవ్రంగా గాయపడిన వారిలో క్రిస్ లిన్ నంబర్ వన్. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మొదటి మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 93 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. అయితే, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడడంతో భుజానికి గాయమైంది. దీనితో అతను తన స్వదేశమైన ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. టోర్నీ ముగిసేలోగా ఇంకెంత మంది గాయాలతో అంతర్జాతీయ సేవలకు దూరమవుతారో!