ఆటాపోటీ

టెన్నిస్ ప్రేమికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యదరా సముద్రం మీదుగా తొలిసారి విమానాన్ని నడిపిన ఫ్రెంచ్ పైలట్ రొలాండ్ గారోస్ టెన్నిస్ ప్రేమికుడు. చదువుకునే రోజుల్లో తరచు టెన్నిస్ కోర్టులో ప్రత్యక్షమై, ప్రాక్టీస్ చేస్తూ కనిపించేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు పశ్చిమ సరిహద్దులో అతను పైలట్‌గా సేవలు అందించాడు. ఆ సమయంలోనే జర్మనీకి దగ్గర దారిని కనుగొన్నాడు. అంతేకాదు.. విమానానికి ఉండే ప్రొపెల్లర్స్‌ను ఉపయోగించి, మెషిన్ గన్స్‌ను వాడే విధానానికి శ్రీకారం చుట్టాడు. ఆ రోజుల్లో ఇదో సంచలనం. శత్రు శిబిరంపై విరుచుకుపడడంలో, అంతే వేగంగా అక్కడి నుంచి తప్పించుకోవడంలో రోలాండ్ గారోస్‌ను మించిన వారు లేరంటారు. 1918 ఆరంభంలో జర్మనీ సరిహద్దులో చిక్కుబడినప్పటికీ, తప్పించుకొని ఫ్రాన్స్ సరిహద్దుకు చేరుకున్నాడు. డేగ కళ్లతో కాపలాకాసే జర్మనీ ఆర్మీని ఏమార్చి క్షేమంగా బయటపడడమే అతని ప్రతిభకు నిదర్శనం. అయతే, అదే ఏడాది అక్టోబర్ 5న జర్మనీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. రోలాండ్ గారోస్ మరణించిన ఉజెర్స్ ప్రాంతంలోనే ఇప్పటికీ అతని సమాధి ఉంది. టెన్నిస్ అంటే అమితంగా ఇష్టపడే వ్యక్తిగానూ, దేశానికి విశిష్ట సేవలు అందించిన వాయుసేన అధికారిగానూ ప్రజల మన్ననలు పొందాడు కాబట్టే, ఫ్రెంచ్ నాకౌట్ టెన్నిస్ టోర్నీకి అతని పేరు పెట్టారు. ఇప్పుడు టోర్నమెంట్‌కే కాదు.. అక్కడి కోర్టులకు కూడా రొలాండ్ గారోస్ పేరు స్థిరపడింది.