ఆటాపోటీ

దమ్మున్నోళ్లకే ‘రొలాండ్ గారోస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన రాఫెల్ నాదల్. ఈసారి అతను గాయాల సమస్య నుంచి బయటపడి
టైటిల్ సాధిస్తాడో లేక ఫిట్నెస్ సమస్యతో విఫలమవుతాడో చూడాలి.
ఫ్రెంచ్ ఓపెన్‌గా చాలా కొన్ని దేశాల్లో మాత్రమే పరిచయమైన రొలాండ్ గారోస్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలవడం మాట ఎలావున్నా, క్వాలిఫయర్స్‌ను పూర్తి చేసుకొని మెయిన్ డ్రా అర్హత సంపాదించడానికే చాలా కష్టపడాలి. ఈ టోర్నమెంట్ క్లే కోర్టుపై జరుగుతుంది కాబట్టి, అత్యుత్తమ అథ్లెట్లను మించిన స్టామినా ఉంటేనే పోటీలో ముందడుగు వేయగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే, దమ్మున్లోళ్లకు మాత్రమే రొలాండ్ గారోస్ పరిమితం. గ్రాస్, హార్డ్ కోర్టుల్లో మాదిరిగానే ఫ్రెంచ్ ఓపెన్‌లో నింపాదిగా కదిలితే, బంతిని బలంగా కొట్టడానికే కాదు.. దానిని చేరుకోవడం కూడా అసాధ్యమే. టెక్నిక్‌కు బలాన్ని కూడా జత కలిపి, ప్రతి మ్యాచ్‌లోనూ ఆద్యంతం పోరాడితేగానీ కళ్లు మిరుమిట్లు గొలిపే ట్రోఫీని అందుకోలేరు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏ విధంగా ఆడతారన్నదే టెన్నిస్ క్రీడాకారుల సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటున్నారంటే, ఇక్కడ ఆట ఎంత కష్టతరమో స్పష్టమవుతుంది.
విభిన్నమైన గ్రాండ్ శ్లామ్
ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలను కలిపి గ్రాండ్ శ్లామ్‌గా అభివర్ణిస్తారు. ఈ నాలుగు గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఎంతో విభిన్నమైంది. క్లే కోర్టుపై జరిగే ఏకైక టోర్నీ కాబట్టే ఇది ప్రాధాన్యతను, ప్రత్యేకతను సంతరించుకున్నది. హార్డ్ లేదా క్లే కోర్టుల్లో బంతి వేగంగా దూసుకెళుతుంది. కాబట్టి, క్రీడాకారులు ముందుగానే దాని దిశను గుర్తించి, తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతారు. దీని వల్ల వారు బంతిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందే తప్ప, ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. కానీ, క్లే కోర్టుల్లో బంతి చాలా నెమ్మదిగా కదులుతుంది. దీనితో బంతి ఎటు వస్తుందో తెలియక క్రీడాకారులు ఇబ్బంది పడతారు. దీనికితోడు బంతిని చేరుకోవడానికి వారు విపరీతంగా కష్టపడాలి. క్రీడాకారులకు అథ్లెట్స్‌ను మించిన ఫిట్నెస్ లేకపోతే, ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించడం సాధ్యం కాదన్నది వాస్తవం. క్లే కోర్టు స్పెషలిస్టుగా పేరు సంపాదించిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ వంటి కొంత మందికి మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ పాదాక్రాంతమైంది. చాలా మందికి అందని ద్రాక్షగానే మారింది. తొమ్మిది సార్లు పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న నాదల్ చివరిసారి 2014లో టైటిల్ సాధించాడు. తర్వాత రెండేళ్లు అతను ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటూ, అనుకున్న రీతిలో రాణించలేకపోయాడు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకూ జరిగే 116వ ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను ఎంత వరకూ రాణిస్తాడన్నది ఆసక్తి రేపుతున్నది. సుమారు ఏడాది కాలంగా అతను నిలకడగా ఆడుతూ మళ్లీ పూర్వ వైభవాన్ని గుర్తుకు తెస్త్తున్నాడు. తాజాగా మాడ్రిడ్ ఓపెన్‌ను గెల్చుకొన్నాడు. నిజానికి క్లే కోర్టుపై ఆడాలంటే ఫిట్నెస్ సమస్యలు ఉండకూడదు. ఈ పరిస్థితుల్లో తరచు గాయాలబారిన పడే నాదల్ ఎంత వరకు ఫిట్నెస్‌తో ఉంటాడనేది అనుమానమే. హోరాహోరీగా సాగే మ్యాచ్‌ల్లో అతను నెగ్గుకురావడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం.
టోర్నీకి పైలట్ పేరు
ఫ్రెంచ్ ఓపెన్‌గా పిలిచే ఈ టోర్నమెంట్‌ను నిజానికి ‘రోలాండ్ గారోస్’గా పేర్కోవాలి. టోర్నీకి అదే అధికారిక నామం. పైలెట్‌గా పని చేసిన రొలాండ్ గారోస్ పేరును ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీకి పెట్టారు. అందుకే, ఫ్రెంచ్ ఓపెన్ జరిగే ప్రధాన కోర్టుకు కూడా అదే పేరు స్థిర పడింది. చాలా దేశాల్లో ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఎక్కువ మందికి తెలియదు. రొలాండ్ గారోస్ పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఫ్రాన్స్‌లో ఈ టోర్నీని ‘లెస్ ఇంటర్నేషనాక్స్ డి ఫ్రాన్స్ డి రోలాండ్ గారోస్’, ‘టోర్నోయ్ డి రోలాండ్ గారోస్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ అన్న పేరును ఫ్రెంచ్ క్రీడాభిమానులు వ్యతిరేకిస్తారు. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. నిర్వాహకులు కూడా అదే స్థాయిలో శ్రమించడంతో, ఈ టోర్నీ గ్రాండ్ శ్లామ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను సాధించడానికి ఈసారి హేమాహేమీలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, పోటీ తీవ్రంగా ఉండనుంది. టైటిళ్లు ఎవరికి దక్కినా, ప్రతి మ్యాచ్ ఉత్కంఠను రేపనుంది. మొత్తం మీద అభిమానుల కోసం ఫ్రెంచ్ ఓపెన్ విందు సిద్ధమవుతున్నది.
పోరు తీవ్రం!
గతంతో పోలిస్తే ఈసారి రొలాండ్ గారోస్‌లో పోరు తీవ్ర రూ పంలో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. పురుషుల విభాగం లో నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో గార్బినె ముగురుజా డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు. తొమ్మిది ప ర్యాయాలు టైటిల్ సాధించి, రికార్డు సృష్టించిన ‘స్పెయన్ బుల్’ రాఫెల్ నాదల్ రోమ్ ఓపెన్ నుంచి గాయం కారణంగా వైదొలగ డం అతని ఫిట్నెస్‌పై అనుమానాలకు కారణమైంది. ఒకవేళ అత ను కోలుకుని బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది. రోజర్ ఫెదరర్ వెన్నునొప్పితో ఈసారి పోటీలకు దూరమయ్యా డు. అయతే, స్టానిస్లాస్ వావ్రిన్కా తదితరులు అతని బరిలో లేని లోటును భర్తీ చేస్తారు. మహిళల విభాగానికి వస్తే ప్రపంచ నంబ ర్ వన్ సెరెనా విలియమ్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మని స్తున్న కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడడం లేదు. ఆమె రంగం లోకి దిగకపోవడంతో, మహిళల టైటిల్ ఎవరిని వరిస్తుందో చె ప్పలేని పరిస్థితి. మొత్తం మీద ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతలు ఎవరన్నది ఉత్కంఠ రేపుతున్నది

ట్రోఫీలు
మేసన్ మెలెరియో డిట్స్ మెల్లెర్ సంస్థ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీల డిజైన్‌ను ఖరారు చేసి, వాటిని తయారు చేస్తున్నది. నాణ్యమైన వెండితో తయారయ్యే ఈ ట్రోఫీలపై విజేతల పేర్లను చెక్కుతారు. అసలైన ట్రోఫీ ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల వద్ద ఉంటుంది. వెండితోనే తయారు చేసిన నమూనా ట్రోఫీలను విజేతలకు అందచేస్తారు.

క్లబ్ సభ్యులకు మాత్రమే!
* 1891లో ఈ టోర్నీ మొదలైంది. ఆరంభంలో ఫ్రెంచ్ టెన్నిస్ క్లబ్ సభ్యులను మాత్రమే అనుమతించేవారు. ఈ టోర్నీలో మొదటి టైటిల్‌ను గెల్చుకున్న క్రీడాకారుడిగా బ్రైటన్ హెచ్ బ్రిగ్స్ రికార్డు పుటల్లో శాశ్వత స్థానం సంపాదించాడు. నాటి ఫైనల్‌లో అతను 6-3-6-4 తేడాతో బైగ్నెరెస్‌ను ఓడించి, తొలి చాంపియన్‌గా అవతరించాడు. మొదట్లో పురుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది, ఆరేళ్ల తర్వాత, 1897లో మహిళల సింగిల్స్ విభాగంలో పోటీలు ఆరంభమయ్యాయి. ఫైనల్‌లో పి.గిరాడ్‌ను 6-3, 6-1 ఆధిక్యంతో ఓడించిన ఆడిన్ మాడ్సన్ తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టెన్నిస్ రంగంలో పెను మార్పులు చేసుకోవడంతో, ఫ్రెంచ్ ఓపెన్ 1925లో ఓపెన్ టోర్నీగా మారింది. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జీన్ బరోట్రాను 7-5, 6-1, 6-4 తేడాతో ఓడించిన రెనె లాకోస్టే, మహిళల ఫైనల్‌లో కిట్టీ మెక్‌కేన్‌పై 6-1, 6-2 ఆధిక్యంతో విజయం సాధించిన సుజానే లెన్‌గ్లెన్ ఓపెన్ శకంలో తొలి టైటిళ్లు అందుకున్నారు. కాగా, రోలాండ్ గారోస్ ప్రస్థానం 1891 నుంచి నిర్విరామంగా కొనసాగుతునే ఉంది. 1939-1945 మధ్యకాలంలో, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా టోర్నమెంట్‌ను నిలిపేశారు. అయితే, అనధికారికంగా ఫ్రెంచ్ జాతీయ టెన్నిస్ టోర్నీ రోలాండ్ గారోస్ వేదికగా జరిగింది. అయితే, ఆ పోటీలకు ఫ్రెంచ్ వారినే అనుమతించారు.

- విశ్వ