ఆటాపోటీ

రోహిత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వనే్డల్లో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక డబుల్ సెంచరీ నమోదైంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ రికార్డు సృష్టించాడు. 2013 నవంబర్ 2న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో అతను 209 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (2009 నవంబర్ 5న హైదరాబాద్‌లో 175 పరుగులు) రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానం రోహిత్ శర్మకే దక్కడం గమనార్హం. 2016 జనవరి 12న పెర్త్‌లో అతను అజేయంగా 171 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా 156 పరుగులు చేసిన జార్జి బెయిలీకి ఈ జాబితాలో నాలుగో స్థానం లభించింది.