ఆటాపోటీ

క్రీడలకు డోపింగ్ చీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపు ఒలింపిక్స్ సమీపిస్తున్నాయ. మరోవైపు రష్యా అథ్లెట్లు ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనే విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయ. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా కెన్యా కూడా ఇలాంటి ప్రమాదానే్న ఎదుర్కొంటున్నది. ఒలింపిక్స్‌లో కెన్యా అథ్లెట్లకు అవకాశం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద డోపింగ్ సమస్య తాజాగా మరోసారి తెరపైకి వచ్చి, క్రీడా రంగాన్ని భయపెడుతున్నది.

రష్యా కలకలం ఇంకా సమసిపోలేదు. మెగా ఈవెంట్స్‌లో పతకాలను సాధించేందుకు వీలుగా ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించడం అనే దుర్మార్గమైన ప్రక్రియ తెరపైకి వచ్చి, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. డోపింగ్ గురించి చర్చించాల్సిన అవసరం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒలింపిక్స్ ఆరంభమయ్యేలోగా డోపింగ్‌కు పాల్పడిన దేశాలపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది.

ఎవరు ఎన్నిరకాలుగా హెచ్చరిస్తున్నా, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నా డోపింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతునే ఉన్నాయ. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి, అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య, డోపింగ్ నిరోధక విభాగం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా డోపింగ్ సమస్యకు తెరపడడం లేదు. ఇదికొత్త సమస్య కాకపోయనా, ఇటీవల కాలంలో పెరిగిపోతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయ. దేశాలే దోషులుగా తేలడం విచిత్రం.

ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిర్వహించిన అధ్యయనంలో ఎన్నో సంచలన అంశాలు తెరపైకి వచ్చాయ. అథ్లెట్లు అడుగడుగునా డోపింగ్‌కు పాల్పడుతున్నారని, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు, ప్రభుత్వాలు కూడా వారికి సహకరిస్తున్నాయని వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయ.

అత్యంత కీలక సమయాల్లో ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగించే ఉత్ప్రేరకాలు క్రీడా రంగానికి శాపంగా మారాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసం మాదక ద్రవ్యాలను వినియోగించడం ఒక సంస్కృతిగా మారింది. ఒలిం పిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో అథ్లెట్లు ఉత్ప్రేరకాలను వా డుతున్న వైనం మరోసారి తెరపైకి వచ్చి భయపెడుతున్న ది. ఇప్పటికే డోపింగ్ చీడ సోకిన క్రీడా రంగం పరువు పోగొట్టుకుంది. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీ రెండు విడతలుగా సమర్పించిన నివేదికల్లో ఎన్నో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పతకాలను సాధించడానికి వీలుగా రష్యా ప్రభుత్వం స్వయంగా పూనుకొని అథ్లెట్లకు వ్యూహాత్మకంగా డోపింగ్ అలవాటు చేసిందని ఈ కమిటీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వ్యూహాత్మక డోపింగ్‌కు అంతర్జాతీయ అమెచూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) అధికారులు సహకరించారన్నది కమిటీ నిగ్గుతేల్చిన నిజం. పోటీకి దిగిన తర్వాత జయాపజయాలను సమానంగా స్వీకరించాలన్నది క్రీడా రంగంలోని ప్రధాన సూత్రం. విజయాలకు దగ్గర మార్గాలను ఎంచుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్రయత్నాలను ఎండగట్టాల్సిన ఐఎఎఎఫ్ అధికారులే డబ్బుకు కక్కుర్తిపడి డోపింగ్‌ను ప్రోత్సహించడం దారుణం. వాడా నివేదిక బట్టబయలు చేసే వరకూ ఈ విషయంపై ఎవరికీ అనుమానం కూడా రాలేదు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించిన అథ్లెట్లనేకాదు.. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాలను కూడా బ్లాక్‌మెయిల్ చేసి, లక్షలాది డాలర్లు ముడుపులుగా తీసుకున్నాడని ఐఎఎఎఫ్ మాజీ అధ్యక్షుడు లామిన్ డియాక్‌పై వాడా కమిటీ ఆరోపణలు చేసింది. ఇందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. లామిన్ డియాక్ కుమారుడు పపా మసటా డియాక్, వారి న్యాయ సలహాదారు హబీబ్ సిసేలకు కూడా ముడుపుల వ్యవహారంలో సంబంధం ఉందని తేల్చిచెప్పింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాడా కమిటీ జరిపిన విచారణ, ఆతర్వాత సమర్పించిన నివేదిక ఆధారంగా రష్యాపై తాత్కాలికంగా వేటు పడింది. ఈఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లకు తమ జాతీయ పతాకం కింద పోటీ చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది. కాగా, డోపింగ్ వ్యవహారంలో తమ పాత్ర లేదని నిరూపించుకునేందుకు రష్యా ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. క్రీడా శాఖకు చెందిన పలువురు అధికారులను తొలగించింది. కానీ, రష్యాను క్రీడా ప్రపంచం ఇప్పటికీ అనుమానంగానే చూస్తున్నది.
కో ముందు కోటి సవాళ్లు
సెబాస్టియన్ కో మాజీ అథ్లెట్. ఇటీవలే ఐఎఎఎఫ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎంతో కష్టం మీద దక్కించుకున్న ఈ పదవి అతనికి సంతోషాన్నిచ్చినా, అంతకు మించిన సవాళ్లను సృష్టించనుంది. ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వాడా కమిటీ సమర్పించిన రెండు నివేదికల్లోని అంశాలు కోను చిక్కుల్లో పడేయడం ఖాయంగా కనిపిస్తున్నది. నిజానికి కోకు అథ్లెటిక్స్‌పై స్పష్టమైన
అవగాహన ఉంది. పాలనా దక్షుడిగానూ అతను ఎంతో పేరుప్రతిష్టలు ఆర్జించాడు. సుమారు
ఒకటిన్నర దశాబ్దాలపాటు ఐరోపా అథ్లెటిక్స్ సమాఖ్యకు అతను చీఫ్‌గా వ్యవహరించాడు. సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతనిపై ఫిర్యాదులుగానీ, ఆరోపణలుగానీ లేవు. అయితే, అథ్లెట్లు విజయాల కోసం డోపింగ్‌కు ఏ విధంగా పాల్పడతారో అతనికి తెలియదని అనుకోవడానికి వీల్లేదు. వాడా కమిటీ సమర్పించిన రెండో నివేదికలో ఐరోపా దేశాలకు చెందిన కొంతమంది అథ్లెట్ల
పేర్లు చేరాయి. ఫలితంగా కో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. యూరోపియన్ అథ్లెటిక్స్ సమాఖ్యకు చీఫ్‌గా వ్యవహరించిన సమయంలోనే డోపింగ్ సమస్య బలంగా ఉందని, ఈ విషయాన్ని గుర్తించకపోవడం లేదా
తెలిసికూడా స్పందించకపోవడం అతని పొరపాటని వాదనలు వినిపిస్తున్నాయి. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ డోపింగ్ సమస్య ఉందే విషయాన్ని అతని అంగీకరించక తప్పదు. ఐరోపా దేశాల్లోనేగాక, యావత్ ప్రపంచ అథ్లెటిక్స్‌పైనా తనదైన ముద్ర వేసిన కో ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటాడోనని క్రీడాభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఎవరూ ఊహించని విధంగా కొత్తకొత్త మార్గాల్లో అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నారని, వారికి అధికారులు, కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని వాడా కమిటీ చీఫ్‌గా వ్యవహరించిన డిక్ పౌండ్ అంటున్నాడు. గతంలో వాడా అధ్యక్షుడిగా సేవలు అందించిన పౌండ్ ఇప్పుడు వాడా ఆధ్వర్యంలోని కమిటీకి చీఫ్‌గా ఉన్నాడు. రష్యా మాదిరిగానే మరికొన్ని దేశాలపైనా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని అతను చెప్తున్నాడు. వివిధ దేశాల అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఏ విధంగా వాడారో, వారికి ఎవరెవవరు సహకరించారో పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, అయితే, కొన్ని సాంకేతిక పరమైన అంశాలను సరి చూసుకున్న తర్వాత వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని అతను తెలిపాడు. ఎంతో మంది అథ్లెట్లు, అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అతను తేల్చిచెప్పాడు. డోపింగ్‌కు ఐఎఎఎఫ్ అధికారులు సహకరించడం, ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అవినీతికి పరాకాష్ట. అవినీతి ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో చెప్పడానికి వాడా నివేదికలే నిదర్శనాలు. ఎవరూ ఊహించని రీతిలో, చిత్రాతిచిత్రంగా ఏ విధంగా మోసాలు జరుగుతాయో కూడా వాడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే, క్రీడా రంగం యావత్తు మాదక ద్రవ్యాల మత్తులో జోగిపోవడం ఖాయం. -

బిఎస్‌ఎస్