ఆటాపోటీ

శాంతి చర్చలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ మధ్య ఇటీవల శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాల నడుమ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనో, పరస్పరం దాడులకు ఉపక్రమించే ప్రమాదం పొంచి ఉందనో ఈ చర్చలు జరిగాయనుకుంటే పొరపాటే. ఇంతకీ ఇవి రాజకీయ చర్చలుకావు. చిరకాల ప్రత్యర్థులపై ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ మధ్య ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మ్యాచ్‌లు జరిగే సమయాల్లో అభిమానుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా, ముందు జాగ్రత్తచర్యగా చేపట్టిన చర్యలివి. చాలాకాలంగా ఈ రెండు జట్ల మధ్య పోరు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. వీరాభిమానులు రెచ్చిపోయి వీరంగం సృష్టించడం, పరస్పరం దాడులకు ఉపక్రమించడం నిత్యకృత్యమైంది. ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ జట్లు పోటీపడిన ప్రతిసారీ పరస్పర దాడుల్లో కొంతమంది మృతిచెందితే, వందలాది మంది గాయపడడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకు జట్ల యాజమాన్యాలు ఇటీవలే శాంతి చర్చలు జరిపాయి. ఇకపై రెండు జట్లు పోటీకి దిగినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాయి. వీరాభిమానులు రెచ్చిపోయి, విధ్వంసం సృష్టించకుండా అడ్డుకోవడానికి వ్యూహరచనలు చేశాయి. అయితే, కేవలం ఈ రెండు జట్లకే అభిమానుల ఆగడాలు పరిమితం అనుకుంటే పొరపాటే. ఇటీవల వెస్ట్‌హామ్, చెల్సియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా అనే చిన్నారిపై నాణేల వర్షం కురిసిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అక్టోబర్ 27న జరిగిన మ్యాచ్‌లో చెల్సియా 2-1 తేడాతో వెస్ట్ హామ్‌ను ఓడించింది. హోం గ్రౌండ్‌లో ఓడినందుకు వెస్ట్ హామ్ అభిమానులు ఆగ్రహంతో విధ్వంసానికి దిగారు. విజయభేరి మోగించిన చెల్సియా అభిమానులు ఉత్సాహాన్ని ఆపుకోలేక కుర్చీలు, నీళ్ల సీసాలతోపాటు చేతికి అందిన ప్రతి వస్తువునూ మైదానంలోకి విసిరారు. రెండు జట్ల అభిమానులు ఒకరితో ఒకరు పోటీపడుతూ స్టేడియాన్ని రణరంగంగా మార్చారు. చివరికి చేతిలో వస్తువులు ఏవీ లేకపోవడంతో చివరికి నాణేలను బలంగా విసరడం ఆరంభించారు. ఈ సంఘటనలో తన తండ్రితో కలిసి మ్యాచ్ చూసిన ఏడేళ్ల బాలికపై పలు నాణేలు పడ్డాయి. మ్యాచ్ అనంతరం ఆమె వాటిని మీడియాకూ చూపడంతో సాకర్ వీరాభిమానుల ఆగడాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయి. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 11న లండన్‌లో ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎలాంటి అవాంఛిత సంఘటన జరగకుండా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధికారులు చర్యలు ఆరంభించారు. రెండు జట్ల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలను ప్రతిపాదించారు. దీనికి ఇరు జట్ల యాజమాన్యాలు అంగీకరించడమేగాక, చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సాకర్ మ్యాచ్‌లను ఆటలో భాగంగా చూడాలేగానీ యుద్ధాలుగా భావించకూడదని అభిమానులకు సూచించాయి. మొత్తం మీద మొట్టమొదటిసారి రెండు చిరకాల ప్రత్యర్థి జట్ల ప్రతినిధుల మధ్య జరిగిన శాంతి చర్చలు ఎంత వరకూ సత్ఫలితాలనిస్తాయో చూడాలి.